Bhartha Mahasayulaku Vignapthi First Review: ‘ధమాకా’ చిత్రం తర్వాత వరుసగా 7 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకున్న రవితేజ(Mass Maharaja Raviteja), ఇప్పుడు తన ఇమేజ్ కి పూర్తి భిన్నంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bharta Mahasayulaku vignapti) అనే చిత్రం చేసాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల కాబోతుంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. గతం లో ఆయన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘చిత్రలహరి’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ , పాటలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ ని ఇలాంటి సినిమాల్లో చూసి చాలా రోజులు అయ్యింది అంటూ కామెంట్స్ చేశారు.
ఇకపోతే లేటెస్ట్ గానే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కాపీ సిద్ధం అయ్యింది. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది మీడియా ప్రముఖులతో కలిసి చూసిందట మూవీ టీం. వీళ్ళ నుండి వచ్చిన టాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇది ‘పెళ్ళాం ఊరెళ్లితే’ తరహా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా అని టీజర్ ని చూసినప్పుడే ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చింది. సినిమా మొత్తం కూడా రేంజ్ కామెడీ వర్కౌట్ అయ్యినట్టు తెలుస్తోంది. రవితేజ మార్క్ హీరోయిజం షాట్స్ ఇందులో తక్కువే కానీ, ఆయనలోని కామెడీ టైమింగ్ ని మాత్రం పూర్తిగా చాలా కాలం తర్వాత ఈ చిత్రం ద్వారా బయటకు తీసుకొచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా అలా సాగిపోతుందని, సెకండ్ హాఫ్ ఆరంభం లో కాస్త స్లో గా ఉన్నప్పటికీ, మధ్యలో నుండి మళ్లీ కామెడీ వర్కౌట్ అయ్యిందని, క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ కూడా బాగుందని, ఓవరాల్ గా చాలా కాలం తర్వాత రవితేజ నుండి ఒక డీసెంట్, క్లీన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా అని అంటున్నారు. కానీ ఈ చిత్రం పొంగల్ రేస్ ని తట్టుకొని నిలబడగలదా లేదా అనేది చూడాలి. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో రవితేజ ఈ చిత్రానికి ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా పని చేసాడు. సినిమా విడుదలయ్యాక లాభాలు వస్తేనే తీసుకుంటానని నిర్మాతతో అన్నాడట. మరి ఈ చిత్రం రవితేజ కి రెమ్యూనరేషన్ తీసుకునే ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది చూడాలి .