https://oktelugu.com/

Chiranjeevi-Mammootty : చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ అందుకున్న మమ్ముట్టి…

చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకతను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే కొంతమంది సక్సెస్ లను సాధిస్తే మరి కొంత మంది మాత్రం ఫెయిల్యూర్స్ ను ఎదురుకుంటూ ఇండస్ట్రీలో చాలావరకు ఓడిదొడుకులను తట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 11:18 AM IST

    Chiranjeevi-Mammootty

    Follow us on

    Chiranjeevi-Mammootty :  తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే ఒకే ఒక పేరు మెగాస్టార్ చిరంజీవి… ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకోవడంలో కూడా ఆయన చేసిన సినిమాలు చాలా వరకు హెల్ప్ అయ్యాయి. ఇక ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి ఏకచత్రాధిపత్యంతో ఇండస్ట్రీని ఏలుతున్న ఒకే ఒక్క హీరోగా కూడా చిరంజీవి చరిత్రలో నిలిచాడు… ఇక రీసెంట్ గా ఆయన సాధించిన సక్సెస్ లకు గాను సినిమా ఇండస్ట్రీకి అందిస్తున్న సేవలకు గాను తను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోవడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు చిరంజీవి చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తున్న సమయంలో తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన మణిరత్నం దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాలో నటించాల్సింది. కానీ ఆయన ఆ సినిమాలో నటించలేకపోయాడు కారణం ఏంటి అంటే చిరంజీవి ఇమేజ్ కి సరిపడే కథ అది కాకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    నిజానికి రజనీకాంత్ హీరోగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో చేసిన దళపతి సినిమా తెలుగు తమిళ్ ఇండస్ట్రీలలో మంచి విజయాన్ని సాధించింది. నిజానికైతే ఈ సినిమాని తెలుగులో రజినీకాంత్ చిరంజీవి లను పెట్టి మణిరత్నం చేయాలని అనుకున్నారట. కానీ మమ్ముట్టి క్యారెక్టర్ లో పెద్దగా దమ్ము లేకపోవడంతో చిరంజీవి ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేశాడు.

    దాంతో మమ్ముట్టి ఆ పాత్రను చేసి రెండు భాషల్లో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మణిరత్నం చిరంజీవి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాకపోవడం విశేషం. మరి వీళ్ళ కాంబినేషన్ ఎప్పటికప్పుడు తెరమీదకి వచ్చినప్పటికీ కథల విషయంలోనూ లేదంటే క్యారెక్టరైజేషన్ల విషయంలోనూ తేడా వచ్చి ఆ సినిమాలు పట్టాలెక్కలేదు.

    మరి మొత్తానికైతే చిరంజీవితో సినిమా చేయాలని మణిరత్నం చాలా వరకు ప్రయత్నం చేశాడు. ఇక చిరంజీవి కూడా అదే రేంజ్ లో ప్రయత్నించినా కూడా అది కుదరలేదు. ఇక ఏది ఏమైనా కూడా ఒక లెజెండరీ డైరెక్టర్ డైరెక్షన్ లో చిరంజీవి నటించలేకపోవడం కొంతవరకు బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అలాగే మణిరత్నం కూడా మెగాస్టార్ అయిన చిరంజీవిని డైరెక్ట్ చేయలేకపోవడం చాలావరకు తన సినిమా కెరియర్ కి మైనస్ అయిందనే చెప్పాలి…