https://oktelugu.com/

Tamil Star  Hero Vijay : విజయ్ సినిమాలు తీయడం మానేస్తే తమిళం లో నెంబర్ వన్ హీరో ఎవ్వరూ అవుతారు..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతారు. కానీ కొంతమంది మాత్రమే వరుస సక్సెస్ లు సాధించి ఇండస్ట్రీ హిట్లు కొట్టి నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు...

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 11:22 AM IST

    Tamil Star  Hero vijay

    Follow us on

    Tamil Star  Hero Vijay :   తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కమల్ హాసన్ లకు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక చాలా సంవత్సరాల పాటు వీళ్ళిద్దరూ స్టార్ హీరోలుగా వెలుగొందడమే కాకుండా పర్సనల్ గా ఇద్దరు మంచి స్నేహితులు అయినప్పటికీ ప్రొఫెషనల్ పరంగా మాత్రం ఇద్దరు బద్ధ శత్రువులనే చెప్పాలి. ఎవరి సినిమా వచ్చి సూపర్ సక్సెస్ సాధించి ఎవరు ముందుకు దూసుకెళ్తారనే ఒక పోటీని వాళ్ళిద్దరూ పెట్టుకొని ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఎలివేట్ అవుతూనే వస్తుంది. ఇక సినిమాల పరంగా మాత్రమే పోటీని పెట్టుకుంటూ ముందుకు సాగే వారు. ఇక వీళ్ల తర్వాత తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మాస్ హీరోగా ఎదిగిన స్టార్ హీరో విజయ్…ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం…

    ఆయన సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ కానున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో ఆయన పొజిషన్ ని దక్కించుకునే స్టార్ హీరో ఎవరు అంటూ తమిళ్ ఇండస్ట్రీలో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం విజయ్ సినిమా ఇండస్ట్రీకి దూరమైతే మాత్రం చాలామంది స్టార్ హీరోలు నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీపడే అవకాశాలైతే ఉన్నాయి.

    అందులో ముఖ్యంగా అజిత్, సూర్యల మధ్య భీకరమైన పోటీ జరిగే అయితే ఉంది. ఇక విజయ్ తర్వాత అంత మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో వీళ్ళిద్దరే టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. ఇక నిజానికి సూర్యకి తెలుగులో కూడా చాలా మంచి మార్కెట్ అయితే ఉంది. తెలుగు స్టార్ హీరోలకు ఎలాంటి క్రేజ్ అయితే ఉంటుందో సూర్యకి కూడా ఇక్కడ అంత మంచి క్రేజీ ఉండడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఆయన లాంటి హీరో సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా తమిళ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

    ఇక అజిత్ కూడా తనదైన రీతిలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఆయన కూడా నటనలో చాలా పరిణీతిని చూపిస్తూ ఏ క్యారెక్టర్ అయిన కూడా చాలా అద్భుతంగా పోషించగలడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు నెంబర్ వన్ హీరోగా ఎదుగుతారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…