Homeఎంటర్టైన్మెంట్Malavika Mohanan: కెమెరా వెనుక వాళ్ళ అసలు రంగు బయటపెడతారు... ప్రభాస్ హీరోయిన్ ఆరోపణలు

Malavika Mohanan: కెమెరా వెనుక వాళ్ళ అసలు రంగు బయటపెడతారు… ప్రభాస్ హీరోయిన్ ఆరోపణలు

Malavika Mohanan: మలయాళ భామ మాళవిక మోహనన్ 2013లో పట్టం పోలే అనే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అనంతరం పలు భాషల్లో చిత్రాలు చేసింది. రజినీకాంత్ పెట్ట చిత్రంలో ఆమె ఓ కీలక రోల్ చేసింది. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో హీరోయిన్ రోల్ చేసింది. అలాగే తంగలాన్ లో సైతం హీరోయిన్ పాత్ర చేసింది. ఆమె కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. మాళవిక మోహనన్ చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ రాజాసాబ్. ప్రభాస్ కి జంటగా నటించే ఛాన్స్ ఆమె దక్కించుకుంది.

Also Read: మహేష్ బాబు కృష్ణవంశీ కాంబోలో రెండో సినిమా ఎలా మిస్ అయిందంటే..?

మాళవిక పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటిపోతుంది. తాజాగా ఆమె కీలక ఆరోపణలు చేశారు. స్త్రీ పురుష తారతమ్యం పరిశ్రమలో వేళ్లూనుకుపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాల్లో ఒకలా, కెమెరా వెనుక మరొకలా ప్రవర్తించే వ్యక్తులు ఉన్నారని మాళవిక అన్నారు. మాళవిక మాట్లాడుతూ.. సినిమాల్లో కొందరు మహిళలను గౌరవిస్తున్న ముసుగులో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. గత ఐదేళ్లలో అలాంటి ముసుగుతో కూడిన నటులను చాలా మందిని చూశాను. ఎలాంటి సమయాల్లో మహిళలతో మంచిగా మాట్లాడాలి అనేది వారికి తెలుసు. కెమెరా వెనుక వాళ్ళ అసలు రూపం ఏమిటనేది చూశాను. పరిశ్రమలో ఆడ, మగా అనే బేధం ఇంకా ఉంది. దానికి అంతం ఎప్పుడో తెలియడం లేదు.. అన్నారు.

మాళవిక కామెంట్స్ చర్చకు దారితీశాయి. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలో టీజర్ విడుదల కానుంది. రాజాసాబ్ మూవీలో మాళవిక పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. ఆమె కొన్ని యాక్షన్ ఎపిసోడ్ లో కూడా పాల్గొంది. దీనికి సంబంధించిన ఓ వీడియో గతంలో లీక్ అయ్యింది. రాజాసాబ్ మూవీలో నిధి అగర్వాల్, రిద్ది కపూర్ సైతం నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రాజాసాబ్ పలు భాషల్లో విడుదల కానుంది.

మాళవిక నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ సర్దార్ 2. కార్తీ హీరోగా నటిస్తున్నాడు. సర్దార్ కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సర్దార్ మూవీలో కార్తీ డ్యూయల్ రోల్ చేశాడు. పోలీస్ అధికారికంగా, సీక్రెట్ ఏజెంట్ గా రెండు భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ క్రమంలో సర్దార్ 2 పై అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: లోకల్ vs స్టార్స్ :బలగం వేణు ఆ చిన్న పాయింట్ మిస్ అవుతున్నాడా?

Exit mobile version