Mahesh Babu and Krishna Vamsi : సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా ఎక్స్పరిమెంటల్ సినిమాలను చేస్తూ వస్తున్న స్టార్ హీరోలు ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చిందంటే చాలు సేఫ్ జోన్ లో పడిపోయినట్టుగా మినిమం గ్యారంటీ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. దీనివల్ల ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపించరు. కారణం ఏంటి అంటే అలాంటి సినిమాలు చేస్తే అయితే సూపర్ హిట్ అవుతాయి. లేకపోతే డిజాస్టర్స్ గా మారుతాయి. దానివల్ల వాళ్ళ మార్కెట్ ను కోల్పోతామేమో అనే భయంతో రిస్క్ తీసుకోకుండా ఎక్కువగా కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో మహేష్ బాబు (Mahesh Babu)…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు తనకు ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించి పెట్టాయి. మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ లో కృష్ణవంశీ డైరెక్షన్ లో చేసిన ‘మురారి’ (Murari) సినిమాతో మహేష్ బాబు తనలోని నటనని సరికొత్త విధంగా ఆవిష్కరించాడు. ఆ సినిమాలో మహేష్ బాబు నటన చూసిన తర్వాత తను స్టార్ హీరోగా ఎదుగుతాడు అనే నమ్మకం అయితే కృష్ణగారిలో కలిగిందట. మరి ఇలాంటి సందర్భంలోనే కృష్ణవంశీ ఈ సినిమా కోసం మహేష్ బాబుని పూర్తిగా వాడుకొని ఎలాగైనా సరే అతని లోని కొత్త యాంగిల్ ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఆయన చాలావరకు మహేష్ బాబుని చాలా కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత కృష్ణ మరోసారి పిలిచి మహేష్ బాబు తో ఇంకో సినిమా చేయమని అడిగారట.
Also Read : మహేష్ బాబు సినిమాకోసం రాజమౌళి మొదటి సారి ఇలా చేస్తున్నాడా..?
ఇక దాంతో కృష్ణవంశీ మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక మంచి కథను రెడీ చేసుకున్నప్పటికి ఆ కథ కృష్ణ గారిని పెద్దగా అట్రాక్ట్ చేయకపోవడంతో కృష్ణవంశీ మహేష్ బాబు కాంబినేషన్ లో రావల్సిన రెండో సినిమా రాలేదనే చెప్పాలి… ఇక ఇప్పటి వరకు ఎంత మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి కొంతమంది హీరోలు మాత్రమే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు.
అందులో మహేష్ బాబు కూడా భారీ ఎత్తున తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా ప్రతి మహేష్ బాబు అభిమానిని సంతోష పెడుతుందనే చెప్పాలి…ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే హాలీవుడ్ నుంచి మహేష్ బాబుకు విపరీతమైన అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ లైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే మహేష్ బాబు హాలీవుడ్ సినిమాలను కూడా చేస్తాడా? ఓన్లీ తెలుగు సినిమాలను మాత్రమే చేస్తాడా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రభాస్ సినిమా.. టైటిల్ ఇదే !