Atress Hema Daughter: కానీ ఈ అందాల తార ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. సినిమాలలో లేడీ కమెడియన్ గా ప్రేక్షకులను అలరించే నటి హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమాలలోకి ఏంటో ఈ చిన్న తర్వాత ఆమె తన పేరును హేమగా మార్చుకుంది. వెంకటేష్, శ్రీదేవి జంటగా నటించిన క్షణం క్షణం సినిమా నుంచి నటి హేమ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. అప్పటి నుంచి ఇప్పటివరకు నటి హేమ 250కి పైగా సినిమాలలో లేడీ కమెడియన్గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలతో పాటు ఈమె పేరు ఎక్కువగా వివాదాలలో కూడా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అయితే మా ఎలక్షన్స్ సమయంలో నటి హేమ ప్రెస్ మీట్ పెట్టి హోరెత్తించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆమె తోటి నటీనటుల గురించి చేసిన సంచలన ఆరోపణలు కూడా వైరల్ అయ్యాయి.
Also Read: కెమెరా వెనుక వాళ్ళ అసలు రంగు బయటపెడతారు… ప్రభాస్ హీరోయిన్ ఆరోపణలు
గత ఏడాది బెంగుళూరు రేవ్ పార్టీ ద్వారా కూడా హేమ ఇమేజ్ బాగా డామేజ్ అయింది అని కూడా చెప్పొచ్చు. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ డ్రగ్స్ కూడా తీసుకుందని ఆమె మీద ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ క్రమంలో హేమను పోలీసులు అదుపులో తీసుకొని జైల్లో ఖైది గా రిమాండ్ లో కూడా ఉంచారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చినా హేమ తను డ్రగ్స్ తీసుకోలేదని తనకు నిర్వహించిన రక్త పరీక్షలలో కూడా నెగిటివ్ వచ్చిందని దానికి సంబంధించిన రిపోర్టులను కూడా ఆమె సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. ఇది ఇలా ఉంటే సినిమాలకు సంబంధించి సీనియర్ నటి హేమ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సినిమాలలో నటించే ప్రసక్తి లేదంటు తేల్చి చెప్పేసింది.
2021 లో రిలీజ్ అయిన క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో హేమ నటించింది. ఇక ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో మాత్రమే నటించింది. ఇక ఆ తర్వాత హేమ తెలుగులో మరొక సినిమాలో నటించలేదు. సినిమా లలో నటించే అవకాశం లేదని చెప్పినా హేమ సినిమా ఇండస్ట్రీలో తన వారసురాలిగా కూతురిని దింపుతుందా అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. హేమ గారాల కూతురు గురించి కూడా సామాజిక మాధ్యమాలలో నేటిజన్స్ సర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి హేమ కూతురి ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈమెను చూసిన వాళ్ళందరూ కూడా చాలా అందంగా ఉంది అంటూ ప్రశంసిస్తున్నారు.
Also Read: లోకల్ vs స్టార్స్ :బలగం వేణు ఆ చిన్న పాయింట్ మిస్ అవుతున్నాడా?