ఎంటర్టైన్మెంట్SSMB 29 : ఎస్ఎస్ఎంబి 29 ... ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మహేష్ లుక్...

SSMB 29 : ఎస్ఎస్ఎంబి 29 … ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మహేష్ లుక్ అలా, మైండ్ బ్లోయింగ్ న్యూస్!

SSMB 29 : సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్స్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళి చిత్ర షూటింగ్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా.. అనే ఆసక్తి సినిమా లవర్స్ లో నెలకొని ఉంది. ఇదే సమయంలో ఈ బడా ప్రాజెక్ట్ పై అనేక రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ గురించి ఓ క్రేజీ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ బాబుకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. అందులో ఆయన లుక్ బాగా రఫ్ అండ్ రగ్డ్ గా ఉంటుందట. ఇప్పటివరకు మహేష్ ని ఇలాంటి లుక్ లో ప్రేక్షకులు చూసి ఉండరని, నిజంగా ఇది సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అవుతుందని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ, ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ లేపేదిగా ఉంది.

ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్, ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉంటుందట. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. కాగా మరోవైపు రాజమౌళి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భార్య రమా రాజమౌళితో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు. అలాగే క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో కలిసి ఓ యాడ్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. దాంతో మహేష్ మూవీ ఎప్పుడు పూర్తి చేస్తావని ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మహేష్ ఈ చిత్రం కోసం మేకోవర్ సాధించనున్నాడు. అందుకే కఠిన వర్కౌట్స్ చేస్తూ బాడీ ని పాత్రకు తగ్గట్లు మారుస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేది జూన్ తర్వాతే అని టాక్ వినిపిస్తోంది. కాగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్స్ ఆలస్యం అవుతున్న కొద్దీ ఆందోళన చెందుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Mahesh Babu Emotional Post: ‘నువ్వు ఎప్పటికీ చిన్నారివే’ అంటూ కూతురు సితారపై మహేష్ ఎమోషనల్ పోస్ట్..

Mahesh Babu Emotional Post: సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనేక ఇంటర్వ్యూస్ లో ఆయన తన తండ్రి కృష్ణ గురించి...

Tollywood Re Release : ఆగస్టు లో మహేష్.. సెప్టెంబర్ లో పవన్.. అక్టోబర్ లో ప్రభాస్.. గెలిచేది ఎవరో..

Tollywood Re Release : టాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తికరమైన పోరుకి తెరలేచింది. గత కొంతకాలం నుండి రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. ఈ ట్రెండ్...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version