Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: టార్గెట్ పిఠాపురం.. పవన్ ను ఓడిస్తే సినిమా హీరోలు రాజకీయాల్లోకి ఇంకా రారు

Pawan Kalyan: టార్గెట్ పిఠాపురం.. పవన్ ను ఓడిస్తే సినిమా హీరోలు రాజకీయాల్లోకి ఇంకా రారు

Pawan Kalyan: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు సీఎం జగన్ ప్రత్యేకంగా టాస్క్ ఇచ్చారు. ఎన్నికల వరకు మీరు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగానే మాట్లాడాలని ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్నారు. అందుకే ఆయన నోరు తెరిస్తే చాలు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే పవన్ పై ఉన్న కోపాన్ని సినిమా నటులపై ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను ఓడించడం ద్వారా.. ఇక సినిమా నటులను రాజకీయాల్లోకి రాకుండా చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. అయితే నందమూరి తారక రామారావు ద్వారా రాజకీయ పదవులు అనుభవించిన ముద్రగడ.. అదే సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఈ తరహా వ్యాఖ్యలు వెనుక.. పవన్ పై ముద్రగడకు ఉన్న అక్కసును బయటపెడుతోంది.

పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ ఎలాగైనా పవన్ ను ఓడించాలని జగన్ చూస్తున్నారు. అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ముద్రగడను కేవలం పవన్ ను తిట్టించేందుకే ప్రయోగిస్తున్నారు. వాస్తవానికి పవన్ పై ముద్రగడ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. గతంలో కూడా ఇదే ముద్రగడ పవన్ కళ్యాణ్ పై సవాల్ కూడా చేశారు. దమ్ముంటే పిఠాపురం నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అయితేజగన్ ముద్రగడను పరిగణలోకి తీసుకోలేదు. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను తెచ్చి పవన్ కళ్యాణ్ పై నిలబెట్టారు. వంగా గీత గెలుపు బాధ్యతను పూర్తిస్థాయిలో ముద్రగడపై పెట్టలేదు. కేవలం కాపు ప్రముఖులను వైసీపీలోకి రప్పించే బాధ్యతతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలకే ముద్రగడను పరిమితం చేశారు. అందుకే ప్రెస్మీట్లతో పాటు కాపు నేతల సమావేశాల్లో సైతం ముద్రగడ అదేపనిగా పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఈ క్రమంలో సినిమా నటుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది వైసీపీకి ఇబ్బందికర పరిణామంగా మారనుంది.

సినిమా నటులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంటే స్థానిక సమస్యలు పరిష్కారం కావు అని ముద్రగడ చెబుతున్నారు. గెలిచిన తర్వాత వారు షూటింగ్లలో ఉంటారని.. బెంగుళూరు, చెన్నై, ముంబాయి, హైదరాబాద్, లండన్ వెళ్లి వారికి సమస్యలు చెప్పుకోవాలా అని ముద్రగడ ప్రశ్నిస్తున్నారు. అయితే తనకు రాజకీయ పదవులు ఇచ్చిన నందమూరి తారక రామారావు సినీ నటుడు కాదా? వైసీపీ మంత్రి రోజా యాక్టర్ కాదా? పోసాని కృష్ణ మురళి సినిమా నటుడు కాదా? కమెడియన్ అలీ సినిమాల్లో రాణించడం లేదా? అంటే వారంతా వైసీపీ నుంచి బయటకు వెళ్లాలని చెబుతున్నారా? అన్నప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సర్కార్ పై సినీ పరిశ్రమ గుర్రుగా ఉంది. ఈ ఎన్నికల్లో సినిమా పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా మద్దతు తెలపడం లేదు. ఇటువంటి తరుణంలోపవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే క్రమంలో.. ముద్రగడ సినీ పరిశ్రమపై అనుచిత కామెంట్స్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ముద్రగడ ఆశ చూస్తే మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లో పవన్ పిఠాపురంలో గెలవకూడదు. గెలవనివ్వకూడదు. ఆ కోణంలోనే ఆయన పని చేస్తున్నారు. అయితే ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం లేదు. కేవలం ప్రెస్ మీట్ లు, అంతర్గత సమావేశాలకి పరిమితమవుతున్నారు. పిఠాపురంలో పవన్ ను ఓడించాలని చేస్తున్న వ్యాఖ్యలు.. తిరిగి పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version