Kanguva movie : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూర్య…ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. అందువల్లే ఆయన ‘గజిని’, ‘సెవెంత్ సెన్స్’ లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ ని ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు కూడా శివ డైరెక్షన్ లో ‘కంగువ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే తమిళంలోని న్యూ ఇయర్ ‘ పూతండు’ ఫెస్టివల్ సందర్భంగా కంగువ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్ లో అప్పటి ‘కంగువ ‘ గెటప్ లో ఉన్న వ్యక్తి,, మోడ్రన్ గెటప్ లో ఉన్న సూర్య ఇద్దరు ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. అయితే దీని అర్థం ఏంటి అంటే ఒకరికొకరు యుద్ధం చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? గతం, వర్తమానం పోట్లాడితే కొత్త భవిష్యత్తు రానుందా? అనే ఒక క్యూరియాసిటి ని కలిగించేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేసి రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరూ ఒకే టీమ్ పిరియడ్ లో కనబడతారా? లేదంటే ఒకరి శకం ముగిసిన తర్వాత మరొకరు కనిపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ వీళ్ళు ఒకే టైం పిరియడ్ లో కనక కనిపించినట్టైతే సినిమా ఎలా ఉండబోతుంది అంటూ ఈ పోస్టర్ ని చూసిన విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సూర్య మరోసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలను మాత్రమే డీల్ చేసిన శివ ఈ సినిమాతో డిఫరెంట్ అటెంప్ట్ ను కూడా సక్సెస్ ఫుల్ గా చేయగలడు అనేది చేసి చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుందో…