Mahesh , Rajamouli
Mahesh and Rajamouli : మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమా షూటింగ్ ఇటీవలే ఒడిశా ప్రాంతంలో మొదలై ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో కూడా లీకై బాగా వైరల్ అయ్యింది. మహేష్ బాబు వీల్ చైర్ మీద ఉన్నటువంటి పృథ్వీ రాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) ముందు మోకాళ్ళ మీద కూర్చుంటాడు. మహేష్ లుక్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి, హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాడు. మరి పాన్ వరల్డ్ సినిమా అంటే ఆ మాత్రమైనా ఉండాలి కదా. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ అభిమానులెవ్వరికీ తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా తో పంచుకున్నాడు. అయితే పృథ్వీ రాజ్ కి ముందు ఈ సినిమాలో ఆయనకు బదులుగా జాన్ అబ్రహం నటిస్తున్నట్టు వార్తలు వినిపించాయి.
Also Read : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళి కి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…
అయితే పృథ్వీ రాజ్ రీసెంట్ గా జరిగిన ఒక మీడియా ఇంటరాక్షన్ లో ఈ విషయం పై స్పందించాడు. ‘నేను, మహేష్ బాబు ఒడిశా కి వచ్చిన వీడియోలు మీరంతా చూసేసారు కదా, ఇక దాచుకోవాల్సిన అవసరం లేదు, చెప్పేస్తున్నాను..అవును, నేను మహేష్, రాజమౌళి సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో నేను ఈమధ్యనే జాయిన్ అయ్యాను అనుకుంటే మీ పొరపాటే. ఏడాది నుండి నేను మహేష్, రాజమౌళి తో కలిసి ప్రయాణం చేస్తున్నాను. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో రెగ్యులర్ గా పాల్గొంటూ వస్తున్నాను, ఇవన్నీ గోప్యంగా ఉంచాల్సిన విషయాలు కాబట్టి, ఇన్ని రోజులు నేను స్పందించలేదు. కానీ ఇప్పుడు స్పందించక తప్పడం లేదు. త్వరలోనే నేను, రాజమౌళి, మహేష్ బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నాం, అప్పుడు మీకు పూర్తి వివరాలను అందిస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీ రాజ్.
ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఏడాది నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై వీళ్లంతా పని చేస్తున్నారంటే, ఈ సినిమాని రాజమౌళి ఏ రేంజ్ లో ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరో విశేషం ఏమిటంటే, స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి అయ్యాక, రాజమౌళి ఈ సినిమా షూటింగ్ కి అనువైన లొకేషన్స్ ని వెతకడం కోసం దాదాపుగా ఆరు నెలల సమయం తీసుకున్నాడట. ఈసారి ఆయన గురి నేషనల్ మార్కెట్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. #RRR చిత్రం తో ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు లభించింది. మహేష్ తో చేయబోతున్న సినిమాతో ఏకంగా హాలీవుడ్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేయడానికే స్పాట్ పెట్టేసాడు రాజమౌళి, చూడాలి మరి ఆయన ప్రభంజనం ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.
Also Read : మహేష్, రాజమౌళి సినిమా పై అలాంటి ఆశలు ఉంటే పప్పులో కాలేసినట్టే!