https://oktelugu.com/

Mahesh Babu : రాజమౌళి మాటను లెక్క చేయని మహేష్ బాబు…

Mahesh Babu : ఇప్పటి వరకు తెలుగులో చాలా మంది దర్శకులు ఉన్నప్పటికి వాళ్ళందరి కంటే భారీ గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు దూసుకెళ్తున్న వాళ్లలో రాజమౌళి మొదటి స్థానం లో ఉంటాడు...అందుకే ఆయన తో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరూ క్యూ కడుతున్నారు...

Written By: , Updated On : March 22, 2025 / 08:05 AM IST
Mahesh Babu

Mahesh Babu

Follow us on

Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి…ఈయన తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఎలాగైనా సరే భారీ విజయాలను నమోదు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను చాలా రహస్యంగా చిత్రీకరిస్తున్న రాజమౌళి మహేష్ బాబు లుక్కుని సైతం బయటికి రివిల్ చేయకుండా కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు చూస్తే మహేష్ బాబు ట్రెండ్స్ యాడ్ లో దర్శనమిచ్చాడు. దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. రాజమౌళి అంత తేలిగ్గా మహేష్ బాబుని బయటికి అయితే వదలడు.

Also Read : మహేష్ బాబు సినిమాల్లో రాజమౌళి కి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమట…

మరి తనను బయటకు వదిలి తన లుక్కుని కూడా రివీల్ చేశాడు అంటే దీని వెనక ఏదో పెద్ద కారణం ఉంది అంటూ రాజమౌళి మీద చాలామంది చాలా రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మహేష్ బాబు మాత్రం రాజమౌళిని లైట్ తీసుకొని యాడ్ ఫిల్మ్ చేశాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. యాడ్ ఫిల్మ్ వల్ల మహేష్ బాబు లుక్ బయటకు రావడమే కాకుండా రాజమౌళి ఎలాంటి ప్లాన్ వేస్తున్నాడా అనే ధోరణిలో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు.

ఈ యాడ్ లో మహేష్ బాబు తో పాటు సితార కూడా కలిసి నటించిన విశేషం. ఇక రాజమౌళి ఏది చేసినా ఒక సెన్సేషన్ గా మిగిలిపోతుంది. కాబట్టి తన స్ట్రాటజీ లో భాగంగా మహేష్ బాబు లుక్ ని రివీల్ చేశాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వాటి వెనకాల ఎలాంటి ప్లాన్ వేశారు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

బాహుబలి(Bahubali), త్రిబుల్ ఆర్ (RRR) సినిమాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరించిన రాజమౌళి ఈ సినిమాతో పాన్ వరల్డ్ ప్రేక్షకులను సైతం అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన ‘జేమ్స్ కామెరూన్’ లాంటి స్టార్ డైరెక్టర్ పక్కన తన పేరును నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు…

Also Read : ప్రొడ్యూసర్లను బ్రతికిస్తున్న ఒకే ఒక్క హీరో మహేష్ బాబు.. గొప్ప నిర్ణయానికి శ్రీకారం…