https://oktelugu.com/

India Post GDS Result 2025: ఇండియా పోస్ట్ ఫలితాలు విడుదల.. ఎవరు ఎంపికయ్యారంటే?

India Post GDS Result 2025 కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేసింది. వరుస నోటిఫికేషన్లు ఇవ్వడంతోపాటు.. ఫలితాలను కూడా ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా పోస్టర్, రైల్వే గ్రూప్‌డీ, అగ్నివీర్, నేవీతోపాటు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు భర్తీ చేస్తోంది.

Written By: , Updated On : March 22, 2025 / 08:16 AM IST
India Post GDS Result 2025

India Post GDS Result 2025

Follow us on

India Post GDS Result 2025: కేంద్రం పోస్టల్‌ శాఖలో ఖాళీగా ఉన్న డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపిదికన ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని తెలిపింది. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే పోస్టుల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా ఇండియా పోస్ట్‌ గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) ఫలితాలు మార్చి 21(శుక్రవారం) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 21,413 ఎఈ పోస్టుల కోసం ఈ ఫలితాలను ఇండియా పోస్ట్‌ ప్రకటించింది. అభ్యర్థుల మెరిట్‌ జాబితా ఆధారంగా ఎంపిక జరిగింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో (indiapostgdsonline.gov.in) చెక్‌ చేసుకోవచ్చు.

Also Read: ఏపీలో డీఎస్సీకి లైన్ క్లియర్.. నోటిఫికేషన్ కు కసరత్తు!

ఫలితాలను డౌన్‌లోడ్‌ చేయడానికి:
అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
“Shortlisted Candidates” లేదా ‘Results‘ విభాగంలోకి వెళ్ళండి.
మీ సర్కిల్‌ లేదా రాష్ట్రాన్ని ఎంచుకోండి.
PDF ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసి, మీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా పేరును చెక్‌ చేయండి.
ఎంపికైన అభ్యర్థులు తదుపరి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ కోసం సిద్ధంగా ఉండాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) నియామక ప్రక్రియ ఇలా..

1. నోటిఫికేషన్‌ విడుదల
ఇండియా పోస్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ (indiapostgdsonline.gov.in) ద్వారా ఎఈ పోస్టుల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. ఇందులో పోస్టుల సంఖ్య, అర్హతలు, దరఖాస్తు తేదీలు మరియు ఇతర వివరాలు ఉంటాయి.

2. అర్హత ప్రమాణాలు
విద్యార్హత: 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత, గణితం మరియు ఇంగ్లీష్‌లో తప్పనిసరి సబ్జెక్టులతో.
వయస్సు: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య (రిజర్వేషన్‌ వర్గాలకు సడలింపు ఉంటుంది). స్థానిక భాషా పరిజ్ఞానం: ఆయా రాష్ట్రంలోని స్థానిక భాషలో ప్రావీణ్యం అవసరం.
3. ఆన్‌లైన్‌ దరఖాస్తు
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసి, దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
అవసరమైన డాక్యుమెంట్లు (10వ తరగతి సర్టిఫికెట్, ఫోటో, సంతకం మొదలైనవి) అప్‌లోడ్‌ చేయాలి.
దరఖాస్తు రుసుము (సాధారణంగా రూ. 100, SC/ST/మహిళా అభ్యర్థులకు మినహాయింపు) చెల్లించాలి.
4. మెరిట్‌ ఆధారిత ఎంపిక
ఎఈ నియామకంలో రాత పరీక్ష ఉండదు. 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితా తయారు చేయబడుతుంది.
ఎక్కువ శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు ఎంపికకు అర్హులవుతారు.
రిజర్వేషన్‌ నిబంధనలు (SC/ST/OBC/EWS) కూడా వర్తిస్తాయి.

5. ఫలితాల ప్రకటన
ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF రూపంలో వెబ్‌సైట్‌లో ప్రచురితమవుతుంది. ఇది సర్కిల్‌ల వారీగా లేదా రాష్ట్రాల వారీగా ఉంటుంది.

6. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌
మెరిట్‌ జాబితాలో చోటు సంపాదించిన అభ్యర్థులను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ కోసం పిలుస్తారు.

ధ్రువీకరణ కోసం అవసరమైన డాక్యుమెంట్లు:
10వ తరగతి మార్క్‌షీట్‌ మరియు సర్టిఫికెట్‌
కుల/సామాజిక ధవీకరణ పత్రం (అవసరమైతే)
గుర్తింపు పత్రం (ఆధార్‌ కార్డ్, వోటర్‌ ఐఈ మొదలైనవి)
ఇతర సంబంధిత పత్రాలు

7. చివరి నియామకం
డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత, అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేయబడతాయి.
వారు గ్రామీణ డాక్‌ సేవకులుగా తమ విధులను ప్రారంభిస్తారు.