https://oktelugu.com/

Mahesh babu and Rajamouli : మహేష్, రాజమౌళి సినిమా పై అలాంటి ఆశలు ఉంటే పప్పులో కాలేసినట్టే!

Mahesh babu and Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి సోషల్ మీడియా లో నిత్యం ఎదో ఒక వార్త ప్రచారంలోకి వస్తూనే ఉంది.

Written By: , Updated On : March 20, 2025 / 05:16 PM IST
Mahesh babu , Rajamouli

Mahesh babu , Rajamouli

Follow us on

Mahesh babu and Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గురించి సోషల్ మీడియా లో నిత్యం ఎదో ఒక వార్త ప్రచారంలోకి వస్తూనే ఉంది. ఇటీవలే ఒడిశాలో మొదటి షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మూవీ టీం, ఇప్పుడు రెండవ షెడ్యూల్ ని మొదలు పెట్టుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా షూటింగ్ చకచకా జరిగిపోతుంది కాబట్టి రామ్ చరణ్ చెప్పినట్టుగా ఈ సినిమా రెండు సంవత్సరాల లోపు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని అభిమానులు చాలా బలమైన నమ్మకంతో సోషల్ మీడియా లో ట్వీట్ లు వేస్తున్నారు. ఇలాంటి ఆశలతో ఉన్న అభిమానులు, వెంటనే అలాంటి ఆశలను మదిలో నుండి తీసేయాలని రాజమౌళి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయట. ఇప్పటి వరకు రాజమౌళి ద్రుష్టి కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద మాత్రమే ఉన్నింది.

Also Read : రాజమౌళి మహేష్ బాబు మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను ఎక్కడ ప్లాన్ చేశాడో తెలుసా..?

కానీ మహేష్ తో ఆయన చేయబోతున్న ఈ సినిమా తో ఏకంగా ఆయన పాన్ వరల్డ్ మార్కెట్ పై ద్రుష్టి పెట్టాడు. దేశంలో లో ఉన్నటువంటి అన్ని భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కాబోతుంది. #RRR చిత్రం తో మన ఇండియన్ సినిమాకి ప్రారంభమైన వరల్డ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని, ఈసారి కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అనే లక్ష్యంతోనే ఆయన పని చేస్తున్నాడట. ఒడిశాలో పూర్తి అయిన మొదటి షెడ్యూల్ సినిమాలో కనీసం ఒక్క శాతం కూడా కాదని, వివిధ దేశాల్లో, దట్టమైన అడవుల్లో నెలల తరబడి షూటింగ్స్ చేయాల్సిన షెడ్యూల్స్ ఎన్నో ఉన్నాయని. ఇది రాజమౌళి కెరీర్ లో అతి కష్టమైన సినిమా అని చెప్పుకొస్తున్నారు. మొత్తం మూడు భాగాల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. అంటే రాజమౌళి నుండి మహేష్ బాబు కి విముక్తి కలిగేలోపు ఒక జనరేషన్ పిల్లలు ఎదిగిపోతారు. ఒక్కో భాగాన్ని పూర్తి చేయడానికి కనీసం మూడేళ్ళ సమయం పడుతుందని టాక్.

మొదటి భాగం 2028 వ సంవత్సరం లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో కరోనా లాంటి విపత్తులు అడ్డురాకుంటేనే ఇది కూడా సాధ్యం అవుతుంది. లేకుంటే ఇంకా ఆలస్యం అవ్వొచ్చు. కాబట్టి అభిమానులు ఈ సినిమా తొందరగా విడుదల అవుతుంది అనే అపోహలు మాత్రం పెట్టుకోకండి అంటూ రాజమౌళి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రం విలన్స్ గా ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. వీళ్ళు కూడా ఒడిశా లో ప్లాన్ చేసిన షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఒడిశా ప్రాంతంలో ఉన్న అందమైన ప్రదేశాలను వీళ్ళు ఫోటోలు తీస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, అవి తెగ వైరల్ గా మారాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక షూటింగ్ వీడియో సోషల్ మీడియా లో లీక్ అవ్వగా, రాజమౌళి చాలా ఫైర్ అయ్యాడని టాక్. షూటింగ్ పరిసరాల్లో సెక్యూరిటీ ని బాగా పెంచేసాడట.

Also Read : మహేష్ బాబు కి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయా..?