Rajamouli , Mahesh Babu
Rajamouli and Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. మహేష్ బాబు లాంటి నటుడు సైతం ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో పెను రికార్డ్ లను క్రియేట్ చేయడానికి రంగ సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన ఒకటి కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు అయినప్పటికి డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేస్తూ యావత్ ప్రపంచం ఉన్న సినిమా ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన చేసిన సినిమాలన్నింటితో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక వైవిధ్యమైన గుర్తింపును సంపాదించుకోవడంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి డైరెక్షన్ లో ఆయన చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే మరో షెడ్యూల్ షూట్ కి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడి తో మహేష్ బాబు సినిమా చేయడం చూస్తున్న అతని అభిమానులు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పాన్ వరల్డ్ లో భారీ రికార్డులను కొల్లగొట్టాలనే దిశగా ముందుకు దూసుకెళ్తుందని అందరూ అనుకుంటున్నారు.
Also Read : ప్రొడ్యూసర్లను బ్రతికిస్తున్న ఒకే ఒక్క హీరో మహేష్ బాబు.. గొప్ప నిర్ణయానికి శ్రీకారం…
రాజమౌళి కి మాత్రం మహేష్ బాబు చేసిన సినిమాలన్నింటిలో ఒక రెండు సినిమాలు అంటే చాలా ఇష్టమట. అందులో ఒక్కడు, పోకిరి సినిమాలు ఉండడం విశేషం… ఈ రెండు సినిమాలతో ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక అందువల్లే రాజమౌళికి కూడా ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ చాలా ఇష్టమట. అప్పటినుంచి తనతో సినిమా చేయాలని ప్రణాళిక రూపొందించుకుంటున్నప్పటికి అది ఇప్పుడు వర్కౌట్ అయిందని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పడం విశేషం.
వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తే మాత్రం తెలుగు సినిమా స్థాయి అనేది అంతకంతకు పెరుగుతూ ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇప్పటికే రాజమౌళి లాంటి దర్శకుడు సైతం ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసి వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ మూవీ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : మహేష్, రాజమౌళి సినిమా పై అలాంటి ఆశలు ఉంటే పప్పులో కాలేసినట్టే!