Mahesh Babu Namrata
Mahesh Babu Namrata: శీర్షిక చూడగానే ఆశ్చర్యంగా ఉంది కదూ.. సినిమా స్టార్లు కూడా కొట్టుకుంటారా.. భార్యలపై చేయి చేసుకుంటారా అన్న అనుమానాలు వస్తాయి. ఇక్కడ మహేశ్‌బాబు అనే సరికి ఫ్యాన్స్ కాస్త నొచ్చుకుంటారు. అన్యోన్యంగా ఉండే నమ్రత, మహేశ్‌బాబు మధ్య గొడవలు ఏంటి. చేయి చేసుకునేంత కోపం మహేశ్‌కు ఎందుకు వచ్చింది అన్న సందేహాలు వస్తాయి. కానీ మీరు చదివింది నిజమే.. అంతేకాదు మహేష్ బాబు నమ్రతాను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఆమె అంటే ఎంతో ఎంతో ఇష్టం . తన తల్లిదండ్రులను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు మహేశ్‌బాబు. మరి అలాంటి నమ్రతని మహేశ్‌బాబు ఎందుకు కొట్టాల్సి వచ్చింది అనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది .
ఎందుకు కొట్టాడంటే..
మహేశ్ – నమ్రతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత వీళ్లకి గౌతం పుట్టాడు. గౌతమ్ పుట్టే టైంలో నమ్రత హెల్త్ కండీషన్ అస్సలు బాగోలేదట. అంతేకాదు గౌతమ్ కడుపులో ఎదుగుదల చాలా స్లోగా జరిగిందట. మరీ ముఖ్యంగా ఆమె ఏడో నెలలో ఉన్నప్పుడు గౌతమ్ కదలికలు చాలా తగ్గిపోయాయట . వెయిట్ కూడా ఎక్కువగా లేకపోవడంతో డాక్టర్స్ చాలా టెన్షన్ పడ్డారట. అంతేకాదు అసలు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అని చేతులెత్తేశారట. ఈ టైంలో నమ్రత కూడా చాలా చాలా బాధపడిపోయిందట. డిప్రెషన్లోకి వెళ్లిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం స్టార్ట్ చేసిందట. నమ్రత మైండ్ కంట్రోల్లోకి రావడానికి డాక్టర్ సలహా మేరకు మహేశ్ నమ్రతని లాగిపెట్టి కొట్టాడట. అంతేకాదు ఆ చెప్పదెబ్బ తర్వాత ఆమె మైండ్ స్టేబుల్‌గా వచ్చిందని.. డెలివరీ టైమ్‌లో కూడా ఆమె చాలా చాలా టెన్షన్ పడింది అంటూ ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
అదే ఫస్ట్ అండ్ లాస్ట్..
పెళ్లయిన ఇన్ని ఏళ్లలో మహేశ్‌బాబు నమ్రతని లాగిపెట్టి కొట్టడం ఫస్ట్ అదే లాస్ట్ అదే. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. పిల్లల విషయం నమ్రత చూసుకుంటుండగా, మహేశ్ సినిమాలు, వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుత సమయంలో వారు గొడవ పడే తీరిక కూడా లేదు. ఇక పిల్లలు కూడా పెద్దవారయ్యారు. దీంతో ఇప్పుడు అంతా పిల్లల కేరీర్‌పైనే దృష్టిపెట్టారు.