Suma Son: యాంకరింగ్ లో రెండు దశాబ్దాల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సుమ అలాగే సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్న రాజీవ్ కనకాల గురించి మనకు తెలిసిందే. ఈ జంట ఎప్పటి నుంచో టీవీ, సినిమా అభిమానులందరిని అలరిస్తూ వస్తున్నారు.ఇక ఇప్పుడు వాళ్ల కొడుకు అయిన రోషన్ కనకాల హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ ఒక సినిమా చేశాడు. ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరిగింది.ఆ సినిమా పేరు ఏంటంటే బబుల్‍గమ్…
ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేస్తూ రోషన్ కనకాల ని ఉద్దేశించి రాజమౌళి ఇలా పోస్ట్ చేశాడు. నీ సొంత స్టైల్ ని నీకు నువ్వు ఆపాదించుకుంటూ,మీ అమ్మ నాన్నల పేరు నిలబెట్టుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతావని ఆశిస్తున్నాను అంటూ ఆ టీం కి బెస్ట్ విషెస్ ని కూడా చెప్పాడు. సాధారణంగా రాజమౌళి ఎవరు సినిమాలకు ఫస్ట్ లుక్ లను తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడు కానీ ఈ సినిమాని రాజమౌళి ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటంటే రాజీవ్ కనకాల రాజమౌళి ఇద్దరు కూడా ఇండస్ట్రీ కి వచ్చినప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు.
శాంతినివాసం సీరియల్ చేసిన టైం నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేకుండా ఫ్రెండ్స్ గా ఉన్నారు ఆ ఉద్దేశ్యం తోనే రాజీవ్ కనకాల కొడుకు అయిన రోషన్ కనకాల సినిమాకి తన వంతుగా తను సహాయం చేయగలిగాడు. అయితే ఈ బబుల్‍గమ్ అనే సినిమాకి క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా అనే సినిమాలకు దర్శకత్వం వహించిన రవి కాంత్ పారేపు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తో మానస చౌదరి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.ఇక ఈ సినిమా పోస్టర్ కనక చూసుకుంటే హీరో రోషన్ కనకాల బబుల్ గమ్ నోట్లో పెట్టుకొని హీరోయిన్ అయిన మానస చౌదరిని కౌగిలించుకొని ఆమె వైపు చూస్తూ ఉన్నాడు బబుల్ గమ్ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తూ ఈ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది.ఈ పోస్టర్ ని చూసిన ప్రేక్షకులు ఈ టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. దాంతో రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరో గా మంచి సక్సెస్ అవుతాడు అంటూ చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు…