Mahesh fighting with a lion?: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. దర్శకధీరుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి సైతం బాహుబలి సినిమాతో పాన్ ఇండియాను శాసించే దర్శకుడిగా ఎదిగిపోయాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో ఎంటైర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) తో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లో ఉన్న దర్శకులతో పోటీ పడడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా 1200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని సినిమా యూనిట్ తో పాటు రాజమౌళి అభిమానులు సైతం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యా. అయితే ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసిన రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ ని కూడా బయటికి చెప్పడం లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా పకడ్బందీ ప్రణాళికతో ఉండే రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు విషయంలో కూడా అంతే ప్రణాళికను మైంటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
Also Read: Mahesh Babu : మహేష్ బాబు ను నెంబర్ వన్ హీరోగా ఎదగకుండా చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?
అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక నిధి వేట కోసం ఉండబోతుంది అనే విషయాన్ని అయితే సినిమా రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు నిధి వేటలో అడవి మొత్తం బిజీబిజీ గా తిరుగుతున్న క్రమంలో అతనికి ఒక సింహం ఎదురు పడుతుందట.
ఆ సింహంతో ఆయన ఫైట్ చేసి దాన్ని చంపేసి నిధి వేట కోసం ముందుకు సాగుతాడు అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్రిబుల్ ఆర్ (RRR) సినిమాలో ఎన్టీఆర్ కి పులితో ఫైట్ ను డిజైన్ చేసిన రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబుకి సింహంతో ఫైట్ పెట్టడం అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.
ఇక సినిమా థియేటర్లో ఈ సీను వచ్చినప్పుడు విజిల్స్ పడడమే కాకుండా ఆ ఎమోషన్ కి ఆడియన్స్ ఊగిపోతారు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి మహేష్ బాబు సింహం దాటి కి ఎలా తట్టుకొని నిలబడతాడు. ఫైనల్ గా దాన్ని ఎలా అంతం చేస్తాడు అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…