Trouble In Nani Paradise Movie: వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అవ్వబోయే సినిమాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాలు ‘పెద్ది'(Peddi Movie), ‘ది ప్యారడైజ్'(The Paradise). ఈ రెండు సినిమాల గ్లింప్స్ వీడియోలు సోషల్ మీడియా లో ప్రకంపనలు పుట్టించాయి. ముఖ్యంగా ‘పెద్ది’ గ్లింప్స్ లో చివరి షాట్ సిగ్నేచర్ షాట్ అయితే గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. IPL సీజన్ లో కూడా ఈ షాట్ వేరే లెవెల్ లో ట్రెండ్ అయ్యింది. ఇక ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ విషయానికి వస్తే ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. ఆడియన్స్ మెంటలెక్కిపోయారు. ముఖ్యంగా అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ లో ట్రెండ్ అయ్యింది. ఈ సినిమా తో నాని(Natural Star Nani) ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోతాడని అంతా అనుకున్నారు. ఆయన గెటప్ కూడా విశేషంగా ఆకట్టుకుంది.
అయితే ఈ రెండు క్రేజీ బజ్ ఉన్న చిత్రాలు వచ్చే ఏడాది ఒక్క రోజు గ్యాప్ లో విడుదల అవ్వడానికి సిద్ధం అయ్యాయి. ‘ది ప్యారడైజ్’ చిత్రం మార్చ్ 26 న విడుదలైతే , రామ్ చరణ్(Global Star Ram Charan) పుట్టినరోజు సందర్భంగా మార్చ్ 27 న పెద్ది చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే నాని సినిమా కంటే రామ్ చరణ్ సినిమా పెద్దది కాబట్టి , కచ్చితంగా నాని తప్పుకుంటాడని అంతా అనుకున్నారు. ‘హిట్ 3’ ప్రొమోషన్స్ సమయం లో ఈ క్లాష్ ప్రస్తావన ని యాంకర్ తీసుకొచ్చినప్పుడు ‘ప్రస్తుతానికి అయితే మార్చ్ 26 న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాము. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్స్ ని కూడా ప్లాన్ చేసుకున్నాము. భవిష్యత్తులో మారితే మారొచ్చేమో, ప్రస్తుతానికి మార్చే ఉద్దేశ్యాలు లేవు. రెండు సినిమాలకు కూడా విపరీతమైన హైప్ ఉంది. ఒక్క రోజు గ్యాప్ తో వచ్చినా పెద్ద నష్టం జరిగే అవకాశాలు లేవు’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
Also Read: Peddi Movie: పెద్ది’ షాట్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? ఎలా క్రియేట్ చేశారంటే!
అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభించాలని అనుకున్నారట. కానీ ట్రైనింగ్ షెడ్యూల్స్ తో సెట్ వర్క్స్ కూడా బాగా ఆలస్యం అవ్వడంతో ఆగష్టు కి మార్చారు. ఆ నెల నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందట. ప్లాన్ ప్రకారం జరగడం లేదు కాబట్టి మార్చి 2026 వ సంవత్సరం లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని మే నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రం లో నాని హీరో గా నటించడమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గానే ‘హిట్ 3’, ‘కోర్ట్’ చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకున్న నాని, ఇప్పుడు ఈ చిత్రం తో ఏకంగా కుంభస్థలం బద్దలు కొట్టాలని చూస్తున్నాడు.