Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu- Rajamouli: మహేష్ చేత మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న రాజమౌళి... కండల కోసం...

Mahesh Babu- Rajamouli: మహేష్ చేత మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న రాజమౌళి… కండల కోసం ఎంతలా కష్టపడుతున్నాడో చూడండి!

Mahesh Babu- Rajamouli: రాజమౌళి పర్ఫెక్షనిస్ట్. ఆయన సక్సె సీక్రెట్ కూడా అదే. తన సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. నచ్చిన అవుట్ ఫుట్ వచ్చే వరకు వదలరు. పాత్రలు, సన్నివేశాల విషయంలో కూడా అంతే. ముఖ్యంగా ప్రధాన పాత్రల లుక్ గురించి పర్టిక్యులర్ గా ఉంటారు. హీరో తాను అనుకున్న షేప్ లో ఉండాలి. బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్, రానాలను రాజమౌళి చాలా కష్ట పెట్టారు. ప్రభాస్ అయితే రెండు రకాల బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాల్సి వచ్చింది. శివుడు పాత్రలో కొంచెం సన్నగా కనిపించాడు.

బాహుబలి పాత్ర కోసం భారీగా కండలు పెంచాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా షూటింగ్ కి ముందే జిమ్ లో గంటల తరబడి శ్రమించారు. ఎన్టీఆర్ థైస్ ప్రత్యేకంగా చూపించాలని ఎక్స్పర్ట్ ట్రైనర్ తో జిమ్ చేయించారు. రాజమౌళి విజన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కష్టం వెండితెర మీద కనిపించింది. కాగా మహేష్ ని సైతం కండలు తిరిగిన శరీరంలో రాజమౌళి చూపించనున్నాడట. అందుకు ఇప్పటి నుండే శిక్షణ స్టార్ట్ చేశారు.

రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది పట్టాలెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేశారు. ఈ క్రమంలో మహేష్ రాజమౌళి సూచనల మేరకు జిమ్ లో ట్రైన్ అవుతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆయన రెగ్యులర్ వర్క్ అవుట్ అని చెబుతున్నా.. రాజమౌళి సినిమా కోసం అంటూ ప్రచారం జరుగుతుంది.

మహేష్ బాబుని సిక్స్ ప్యాక్ లో చూసింది లేదు. మహేష్ కండలు పెంచి కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఊహించినదానికి మించి ఇవ్వడంలో రాజమౌళి దిట్ట. కాబట్టి మహేష్ ని గతంలో ఎన్నడూ చూడని లుక్ లో రాజమౌళి ప్రజెంట్ చేస్తారు అనడంలో సందేహం లేదు. ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా అని ప్రకటించారు. బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు అని సమాచారం.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper
Exit mobile version