Joe Root: రికార్డు సృష్టించిన జో రూట్.. అలిస్టర్ కుక్ వెనక్కి..!

యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ ఆడుతోంది. ఈ టెస్ట్ ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో రూట్ మూడు క్యాచ్లు అందుకొని ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టిర్ కుక్ పేరిట ఉన్న 175 క్యాచులు రికార్డును అధిగమించి అత్యధిక క్యాచులు అందుకున్న ఇంగ్లాండు జట్టు ఆటగాడిగా నిలిచాడు.

Written By: BS, Updated On : July 2, 2023 9:50 am

Joe Root

Follow us on

Joe Root: ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు జో రూట్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టులో రికార్డును సృష్టించాడు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్ హజెల్ వుడ్ క్యాచ్ అందుకోవడం ద్వారా టెస్టుల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక క్యాచ్ లు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. జో రూట్ కు ముందు ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ అలిష్టర్ కుక్ 175 క్యాచ్ లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆ రికార్డును అధిగమించాడు రూట్.

టెస్టుల్లో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమయ్యే అరుదైన రికార్డును ఇంగ్లాండ్ జట్టు స్టార్ ప్లేయర్ జో రూట్ సాధించాడు. ఆస్ట్రేలియా జట్టు బౌలర్ హాజెల్ వుడ్ క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ ఘనతను సాధించాడు ఇంగ్లాండ్ జట్టు తరుపున అత్యధిక క్యాచ్ లు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు రూట్.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కుక్ ను అధిగమించిన రూట్..

ఆస్ట్రేలియా జట్టుతో ఇంగ్లాండు
యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ ఆడుతోంది. ఈ టెస్ట్ ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో రూట్ మూడు క్యాచ్లు అందుకొని ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టిర్ కుక్ పేరిట ఉన్న 175 క్యాచులు రికార్డును అధిగమించి అత్యధిక క్యాచులు అందుకున్న ఇంగ్లాండు జట్టు ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్ గా చూసుకుంటే టెస్టుల్లో అత్యధిక క్యాచులు అందుకున్న ఆటగాళ్లు జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు రూట్. ఈ జాబితాలో 210 క్యాచులతో తొలి స్ధానంలో ఉన్నాడు టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్. ఇకపోతే ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో జో రూట్ మూడు క్యాచ్ లు అందుకోవడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు 173 క్యాచులతో కుక్ రికార్డుకు చేరువలో ఉన్నాడు రూట్. అయితే, రాబిన్షన్ బౌలింగ్ లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ ను, స్ట్రోక్స్ బౌలింగ్ లో హాజల్ వుడ్ ఇచ్చిన క్యాచును రూట్ అందుకోవడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

ఇది రూట్ టెస్ట్ కెరియర్..

ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ఆటగాడిగా పేరుగాంచిన రూట్ ఇప్పటి వరకు 132 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. 50.43 సగటు 11,196 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 254 పరుగులు కాగా 30 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ చేసే రూట్ ఇప్పటి వరకు 132 ఇన్నింగ్స్ ల్లో 57 వికెట్లు తీశాడు.