https://oktelugu.com/

Niharika Konidela – Chaitanya: నిహారిక భర్త సంచలన పోస్ట్… విడాకులు అలా కన్ఫర్మ్ చేశారా?

అలాగే ఈ మధ్య కాలంలో వారు కలిసి కనిపించలేదు. ఎక్కడికైనా నిహారిక ఒంటరిగానే వెళుతున్నారు. ఇటీవల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరిగింది. నాగబాబు నివాసంలో జరిగిన వరుణ్-లావణ్య త్రిపాఠీల ఎంగేజ్మెంట్ కి నిహారిక సింగిల్ గా అటెండ్ అయ్యారు. నిహారిక వెంట భర్త వెంకట చైతన్య లేడు. ఈ పరిణామాల నేపథ్యంలో విడాకులు ప్రకటించకున్నా నిహారిక-వెంకట చైతన్య విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి.

Written By:
  • Shiva
  • , Updated On : July 2, 2023 / 10:11 AM IST

    Niharika Konidela - Chaitanya

    Follow us on

    Niharika Konidela – Chaitanya: హీరోయిన్ నిహారిక భర్త వెంకట చైతన్యతో విడిపోయారనే పుకార్లు గత నాలుగు నెలలుగా వినిపిస్తున్నాయి. ఇందుకు వారి సోషల్ మీడియా బిహేవియర్ కారణమైంది. వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించారు. దాంతో భార్య నిహారికతో ఆయనకు మనస్పర్థలు తలెత్తాయనే వార్తలు పుట్టుకొచ్చాయి. నిహారిక మాత్రం ఫోటోలు డిలీట్ చేయలేదు. కొద్దిరోజుల అనంతరం ఆమె కూడా పెళ్లి ఫొటోలతో పాటు వెంకట చైతన్యతో ఉన్న జ్ఞాపకాలు చెరిపేసింది.

    అలాగే ఈ మధ్య కాలంలో వారు కలిసి కనిపించలేదు. ఎక్కడికైనా నిహారిక ఒంటరిగానే వెళుతున్నారు. ఇటీవల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరిగింది. నాగబాబు నివాసంలో జరిగిన వరుణ్-లావణ్య త్రిపాఠీల ఎంగేజ్మెంట్ కి నిహారిక సింగిల్ గా అటెండ్ అయ్యారు. నిహారిక వెంట భర్త వెంకట చైతన్య లేడు. ఈ పరిణామాల నేపథ్యంలో విడాకులు ప్రకటించకున్నా నిహారిక-వెంకట చైతన్య విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి.

    తాజాగా వెంకట చైతన్య చేసి పోస్ట్ వైరల్ అయ్యింది. ఆయన మహారాష్ట్రలో గల గ్లోబల్ విపాసన మెడిటేషన్ సెంటర్ ని సందర్శించారు. అక్కడ పదిరోజులు ఉన్నారు. మానసిక ప్రశాంత పొందేందుకు వెంకట చైతన్య ఆ మెడిటేషన్ సెంటర్ కి వెళ్లారు. గొప్ప అనుభూతి కలిగిందని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఊహకు మించిన శాంతి లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

    నిహారికతో విడాకుల కారణంగా మానసిక వేదనకు గురైన వెంకట చైతన్య ఆ మెడిటేషన్ సెంటర్ సందర్శిచారనే వాదన మొదలైంది. ఇది కూడా ఒక హింట్ అంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇవ్వన్నీ ఊహాగానాలు మాత్రమే, అధికారిక సమాచారం లేదు. మరోవైపు నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టారు. నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్ర చేసిన డెడ్ ఫిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆమె హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశారు.