Mahesh Babu- Rajamouli: మహేష్ చేత మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న రాజమౌళి… కండల కోసం ఎంతలా కష్టపడుతున్నాడో చూడండి!

బాహుబలి పాత్ర కోసం భారీగా కండలు పెంచాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా షూటింగ్ కి ముందే జిమ్ లో గంటల తరబడి శ్రమించారు. ఎన్టీఆర్ థైస్ ప్రత్యేకంగా చూపించాలని ఎక్స్పర్ట్ ట్రైనర్ తో జిమ్ చేయించారు.

Written By: Shiva, Updated On : July 2, 2023 10:06 am

Mahesh Babu- Rajamouli

Follow us on

Mahesh Babu- Rajamouli: రాజమౌళి పర్ఫెక్షనిస్ట్. ఆయన సక్సె సీక్రెట్ కూడా అదే. తన సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. నచ్చిన అవుట్ ఫుట్ వచ్చే వరకు వదలరు. పాత్రలు, సన్నివేశాల విషయంలో కూడా అంతే. ముఖ్యంగా ప్రధాన పాత్రల లుక్ గురించి పర్టిక్యులర్ గా ఉంటారు. హీరో తాను అనుకున్న షేప్ లో ఉండాలి. బాహుబలి సినిమా విషయంలో ప్రభాస్, రానాలను రాజమౌళి చాలా కష్ట పెట్టారు. ప్రభాస్ అయితే రెండు రకాల బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాల్సి వచ్చింది. శివుడు పాత్రలో కొంచెం సన్నగా కనిపించాడు.

బాహుబలి పాత్ర కోసం భారీగా కండలు పెంచాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా షూటింగ్ కి ముందే జిమ్ లో గంటల తరబడి శ్రమించారు. ఎన్టీఆర్ థైస్ ప్రత్యేకంగా చూపించాలని ఎక్స్పర్ట్ ట్రైనర్ తో జిమ్ చేయించారు. రాజమౌళి విజన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కష్టం వెండితెర మీద కనిపించింది. కాగా మహేష్ ని సైతం కండలు తిరిగిన శరీరంలో రాజమౌళి చూపించనున్నాడట. అందుకు ఇప్పటి నుండే శిక్షణ స్టార్ట్ చేశారు.

రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది పట్టాలెక్కనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేశారు. ఈ క్రమంలో మహేష్ రాజమౌళి సూచనల మేరకు జిమ్ లో ట్రైన్ అవుతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో మహేష్ బాబు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆయన రెగ్యులర్ వర్క్ అవుట్ అని చెబుతున్నా.. రాజమౌళి సినిమా కోసం అంటూ ప్రచారం జరుగుతుంది.

మహేష్ బాబుని సిక్స్ ప్యాక్ లో చూసింది లేదు. మహేష్ కండలు పెంచి కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఊహించినదానికి మించి ఇవ్వడంలో రాజమౌళి దిట్ట. కాబట్టి మహేష్ ని గతంలో ఎన్నడూ చూడని లుక్ లో రాజమౌళి ప్రజెంట్ చేస్తారు అనడంలో సందేహం లేదు. ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా అని ప్రకటించారు. బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు అని సమాచారం.