https://oktelugu.com/

ప‌వ‌న్ ఆరోగ్యంపై మ‌హేష్ బాబు ట్వీట్‌.. ఫ్యాన్స్ ఫిదా!

తెలుగులో అగ్ర క‌థానాయ‌కులుగా వెలుగొందుతున్నారు మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అయితే.. కేవ‌లం న‌టులుగా మాత్ర‌మే కాకుండా.. మాన‌వ‌తా వాదులుగా కూడా వీళ్లిద్ద‌రూ ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. క‌ష్టాల్లో ఉన్న‌వారిని ఎంద‌రో ఆదుకుని ఇత‌రుల‌కు స్ఫూర్తిగా నిలిచారు. అందుకే.. సినిమాల‌కు అతీతంగా వీరిని అభిమానులు ఆరాధిస్తుంటారు. ఇక‌, ప‌వ‌న్ – మ‌హేష్ మంచి మిత్రులుగా మెలుగుతుంటారు. ఈ విష‌యం ఎన్నోసార్లు రుజువైంది. మ‌హేష్ బాబు ‘అర్జున్’ సినిమా పైరసీకి గురైనప్పుడు వరంగల్ లో పెద్ద గొడవ జరిగింది. ఈ […]

Written By: , Updated On : April 17, 2021 / 12:18 PM IST
Follow us on

Pawan Mahesh
తెలుగులో అగ్ర క‌థానాయ‌కులుగా వెలుగొందుతున్నారు మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అయితే.. కేవ‌లం న‌టులుగా మాత్ర‌మే కాకుండా.. మాన‌వ‌తా వాదులుగా కూడా వీళ్లిద్ద‌రూ ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. క‌ష్టాల్లో ఉన్న‌వారిని ఎంద‌రో ఆదుకుని ఇత‌రుల‌కు స్ఫూర్తిగా నిలిచారు. అందుకే.. సినిమాల‌కు అతీతంగా వీరిని అభిమానులు ఆరాధిస్తుంటారు.

ఇక‌, ప‌వ‌న్ – మ‌హేష్ మంచి మిత్రులుగా మెలుగుతుంటారు. ఈ విష‌యం ఎన్నోసార్లు రుజువైంది. మ‌హేష్ బాబు ‘అర్జున్’ సినిమా పైరసీకి గురైనప్పుడు వరంగల్ లో పెద్ద గొడవ జరిగింది. ఈ సమయంలో ప్రిన్స్ పై కేసు కూడా నమోదైంది. అప్పుడు పవన్ కల్యాణ్ మహేష్ కు అండగా నిలబడ్డాడు. పైరసీ నిరోధానికి మహేష్ తో కలిసి పోరాడేందుకు సిద్ధమని ప్రకటించాడు పవర్ స్టార్.

అప్పటి నుంచి వీరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ‘జ‌ల్సా’ మహేస్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఇటీవ‌ల మ‌హేష్ బాబు చిత్రం ‘మ‌హ‌ర్షి’ జాతీయ అవార్డు గెలుచుకున్నప్పుడు అభినందనలు తెలిపాడు పవన్. జాతీయ స్థాయిలో జ‌న‌రంజ‌క చిత్రంగా నిలిచినందుకు మ‌హేష్ బాబుతోపాటు, యూనిట్ మొత్తానికి శుభాకాంక్ష‌లు తెలిపాడు ప‌వ‌న్‌.

అలాంటిది.. తాజాగా పవన్ కరోనా బారిన పడడంతో ఆయ‌న‌ ఆరోగ్యంపై వాక‌బు చేశాడు మ‌హేష్‌. ఈ మేర‌కు ట్వీట్ చేశాడు. ‘పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ పోస్టు చేశారు. దీంతో.. పవన్ ఫ్యాన్స్ తోపాటు మహేష్ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. వీరి మధ్య స్నేహం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.