Mahesh Babu Son Gautam: మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో కామెడీ టైమింగ్ అంటే మనకు గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోల్లో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘ఖలేజా’ వచ్చేంత వరకు మహేష్ లో ఈ రేంజ్ కామెడీ టైమింగ్ ఉంటుందని అభిమానులు కూడా ఊహించలేదు. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమాలోనూ కామెడీ టైమింగ్ ని ఉండేలా చూసుకుంటూ వచ్చాడు , అది ఆయన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యేలా చేసింది. అయితే మహేష్ బాబు లో కామెడీ టైమింగ్ ఉంది కదా అని , ఆయన పిల్లల్లో కూడా కచ్చితంగా కామెడీ టైమింగ్ ఉండాలి అనే రూలేమీ లేదు. కానీ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ లో కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉందని రీసెంట్ గా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ని చూసిన తర్వాతే అర్థమైంది.
విదేశాల నుండి ఇండియా కి తిరిగి వస్తున్న సమయం లో గౌతమ్ ని విమానాశ్రయం లో మీడియా రిపోర్టర్స్ వచ్చి ఫోటోలు , వీడియోలు తీయడం మొదలు పెట్టారు. హాయ్ సార్ అని చెప్తే, తిరిగి నవ్వుతూ హాయ్ అని రిప్లై ఇచ్చాడు గౌతమ్. అదే సమయం లో ఫోటోలు తియ్యడానికి ఒక రిపోర్టర్ అత్యుత్సాహం చూపిస్తుండడాన్ని చూసి , పడిపోకు అలా అంటూ నవ్వుతూ కౌంటర్ వేసి కారు ఎక్కేసాడు. ఆయన తో పాటు సితార , నమ్రత శిరోడ్కర్ కూడా ఉన్నారు. అయితే అంత చిన్న డైలాగ్ లో కామెడీ టైమింగ్ ఏముందని మీకు అనిపించొచ్చు , కానీ ఆ చెప్పే విధానం ని చూస్తుంటే వింటేజ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ కనిపించింది. అభిమానులకు కూడా అదే ఫీలింగ్ కలిగింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
లండన్ లో చదువుకుంటున్న మహేష్ బాబు , ఇది వరకే తన స్నేహితులతో కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అవి యూట్యూబ్ లో కూడా బాగా వైరల్ అయ్యాయి, తండ్రితో ఉన్నటువంటి యాక్టింగ్ టాలెంట్ , గౌతమ్ లో కూడా ఉంది , ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే కచ్చితంగా సక్సెస్ అవుతాడు అని మహేష్ అభిమానులే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కామెడీ టైమింగ్ ని చూసిన తర్వాత , ఇతను ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే తిరుగులేదని అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.