Homeఎంటర్టైన్మెంట్Lenin Movie : మరో గ్రాండ్ సక్సెస్ మీట్ కి సిద్దమైన 'లెనిన్' టీం.. ముఖ్య...

Lenin Movie : మరో గ్రాండ్ సక్సెస్ మీట్ కి సిద్దమైన ‘లెనిన్’ టీం.. ముఖ్య అతిథులుగా రాబోతున్నది ఎవరంటే..

Lenin Movie : అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం లాభాల్లోనే నడుస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని విజయవాడ లో నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ అభిమానుల్లో జోష్ నింపడమే కాకుండా, […]

Lenin Movie : అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం లాభాల్లోనే నడుస్తోంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని విజయవాడ లో నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ అభిమానుల్లో జోష్ నింపడమే కాకుండా, కలెక్షన్స్ కూడా స్టడీ గా ఉండేలా చేయడం లో ఉపయోగపడింది. ముఖ్యంగా అఖిల్ తన వీరాభిమాని నాగరాజు (అయ్యగారే నెంబర్ 1) ని కలిసిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమా ప్రొమోషన్స్ కి ఈ వీడియో బాగా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ ని మరింత బూస్ట్ చేసేలా గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారట మేకర్స్.

త్వరలోనే ఈ ఈవెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున తో పాటు ,ఆయన పెద్ద తనయుడు అక్కినేని నాగచైతన్య కూడా రాబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కి విశిష్ట అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కి , నాగార్జున ఫ్యామిలీ కి ఎంతమంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే ఈ సినిమా విజయం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేస్తూ, అఖిల్ నా కొడుకు లాంటి వాడు , అతను సక్సెస్ అవ్వడం చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది అంటూ కామెంట్స్ చేశారు మెగాస్టార్. అందుకు అఖిల్ పెదనాన్న అంటూ ప్రేమతో పలకరించి సమాధానం ఇవ్వడం సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ కి చిరంజీవి విచ్చేసి మనస్ఫూర్తిగా తన ఆనందాన్ని పంచుకుంటే , సినిమా కలెక్షన్స్ పై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరోసారి అక్కినేని , మెగా అభిమానులకు హృదయాన్ని హత్తుకునే ఈవెంట్ రాబోతుంది. చూడాలి మరి ఈ ఈవెంట్ ఈ చిత్రం లాంగ్ రన్ కి ఎంత కలిసొస్తుంది అనేది. ఇకపోతే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మొదటి వారాం లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper