Mahesh Babu Risky Stunt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాత ఆ రేంజ్ లో మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొద్ది కాలం పాటు కృష్ణ కొనసాగాడు. ఇక తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యాడు. పాన్ ఇండియాలో సినిమాని కూడా చేయలేదు. కానీ డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేయడం వెనక ధైర్యం ఏంటి అంటే రాజమౌళి ఉన్నాడు అనే నమ్మకం మాత్రమే…ఇక మహేష్ బాబు కి పాన్ ఇండియాలో కూడా పెద్దగా మార్కెట్ అయితే లేదు… మొత్తానికైతే రాజమౌళికి సరెండర్ అయిపోయిన మహేష్ బాబు అతను ఏది చెబితే అది చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో 3000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టి ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసిన రాజమౌళి తొందర్లోనే ఈ సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేసి 2027 వ సంవత్సరంలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు…సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురం అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో మహేష్ బాబుని తన కొడుకు పాత్రలో నటింపజేశాడు. అయితే అందులో రౌడీలతో ఫైటింగ్ చేసే సన్నివేశం ఒకటుంది. మహేష్ బాబు ఆ సన్నివేశంలో బైక్ స్టంట్స్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందట…
Also Read: కూలీ మూవీ కోలీవుడ్ రివ్యూ…లాంగ్ రన్ లో ఈ సినిమా పరిస్థితి ఏంటో చెప్పేసిన క్రిటిక్స్…
మరి ఇలాంటి సందర్భంలోనే డూపు ను పెట్టుకొని కృష్ణ ఆ స్టంట్స్ చేయమని చెప్పగా మహేష్ బాబు మాత్రం డూప్ లేకుండానే చేస్తానని ఫైట్ మాస్టర్ కి చెప్పారట… అయితే కృష్ణ తన షూటింగ్ 9 గంటలకు ఉండడంతో నేను తొమ్మిది గంటలకు సెట్ కి వస్తానని వచ్చాక మహేష్ బాబు ఫైట్ సీక్వెన్స్ చేద్దామని ఫైట్ మాస్టర్ కి చెప్పారట.
కానీ మహేష్ బాబు మాత్రం డూప్ లేకుండా తనే స్టంట్స్ చేయాలని అనుకున్నాడట. కాబట్టి కృష్ణ అక్కడ ఉంటే తను ఆ స్టంట్స్ చేయడానికి ఆయన ఒప్పుకోడనే ఉద్దేశ్యంతో ఫైట్ మాస్టర్ ని బతిమిలాడుకొని మరి మనం ఆరు గంటలకు వచ్చి 9 గంటల వరకు ఫైట్ ను ఫినిష్ చేద్దాం..ఆ స్టంట్స్ నేనే ఓన్ గా చేస్తాను అని చెప్పారట. దానికి ఫైట్ మాస్టర్ కూడా సరే అని కృష్ణ గారికి చెప్పకుండా ఆ రిస్కీ స్టంట్స్ అయితే మహేష్ బాబు చేశాడు.
Also Read: ఎవరెన్ని చెప్పిన ‘వార్ 2’ లో ఎన్టీఆర్ సెకండ్ హీరోనేనా..?
మొత్తానికైతే ఆ విషయం తెలుసుకున్న కృష్ణ మహేష్ బాబు మీద కోపానికి వచ్చినప్పటికి ఆ స్టంట్స్ చూసి ముచ్చట పడిపోయాడట. ఇంకెప్పుడు ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేయకూడదని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు మొదటి నుంచి కూడా కి రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఇప్పటికీ ఆయన ఓన్ గా కొన్ని స్టంట్స్ చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…