Kollywood Coolie Review: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెనుమార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఏ హీరో చూసినా కూడా భారీ విజయాలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా అల్టిమేట్ గా వాళ్ళ లక్ష్యం మాత్రం సినిమా విజయాన్ని సాధించడమే కావడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు… ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న దర్శకులు గానీ, హీరోలు గాని భారీ రేంజ్ లో సినిమాలను చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాల మీద సగటు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేకపోతున్నారు… ఇప్పటివరకు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు ఏవి కూడా ఆశించిన మేరకు విజయాలనైతే సాధించలేకపోతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని బీట్ చేసే కెపాసిటీ తమిళ్ సినిమా ఇండస్ట్రీకి లేదని చాలామంది వాళ్ళ వాదనను తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న ‘కూలీ’ సినిమా ఈనెల 14వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఇక ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది అంటూ కోలీవుడ్ మీడియా లో ఆన్ కథనాలైతే వస్తున్నాయి… మరి ఫస్ట్ రివ్యూ ని బట్టి చూస్తే ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. రజినీకాంత్ హై వోల్టేజ్ పెర్ఫామెన్స్ ను ఇస్తున్నారట.
Also Read: త్రివిక్రమ్ ను రిజెక్ట్ చేసి అల్లు అర్జున్ పెద్ద తప్పు చేశాడా..?
అలాగే అమీర్ ఖాన్ పాత్ర నిడివి కొద్దిసేపే ఉన్నప్పటికి ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఉపేంద్ర, సత్యరాజు పాత్రలు సినిమాలో కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలుగా కనిపిస్తున్నాయట. ఇక వీళ్ళందర్నీ వాడుకొని లోకేష్ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని కూడా వాళ్ళు చెబుతుండడం విశేషం…
ఇక ఇంతకుముందు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కంటెంట్ అయితే రాలేదని ఈ సినిమాతో లోకేష్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేయబోతున్నాడు అంటూ ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ ని బట్టి కొంతమంది క్రిటిక్స్ వాళ్ళ కామెంట్స్ ని అయితే తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజు చేస్తున్న ఈ సినిమా లోకేష్ యూనివర్స్ లో భాగమైతే కాదని ఇది సపరేట్ స్టోరీ తో వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసినట్టుగా తెలుస్తోంది… రజినీకాంత్ వింటేజ్ లుక్స్ ని చూపించడమే కాకుండా హై ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ ను కూడా ఇచ్చారట…
Also Read: వార్ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చేసిన ఖర్చుతో ఒక సినిమానే తీసేయొచ్చు తెలుసా!
ఆయన సెకండాఫ్ లో తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ ఒక భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ని కూడా డిజైన్ చేశారట. మొత్తానికైతే రజినీకాంత్ ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నారు అంటూ కోలీవుడ్ క్రిటిక్స్ కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. లాంగ్ రన్ లో 1000 కోట్ల కు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతోందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…