Asim Munir: పాకిస్తాన్లో పేరుకు ప్రధానమంత్రి ఉంటాడు. చెప్పుకోడానికి అధ్యక్షుడు ఉంటాడు. కానీ సంపూర్ణ అధికారం మాత్రం ఆర్మీ చీఫ్ చేతిలోనే ఉంటుంది. గతంలో జరిగిన ఘటనలు దీనిని నిరూపించాయి. తాజాగా శ్వేత దేశంలో లో దాయాది దేశం సైన్యాధిపతి అసిమ్ మునీర్ పర్యటిస్తున్నారు.. ఇటీవల జూన్ నెలలో దాయాది దేశానికి చెందిన సైన్యాధిపతి పర్యటించారు. సరిగ్గా రెండు నెలలు కాకముందే మరోసారి ఆయన అమెరికాలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు శ్వేత దేశం వేదికగా మన దేశానికి వ్యతిరేకంగా మునీర్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: ఏపీలో కొత్త జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా.. జాబితా సిద్ధం!
మునీర్ శ్వేత దేశంలో ఉండగానే.. అమెరికా దేశాధ్యక్షుడు ఆదేశాల మేరకు శ్వేత దేశం సరికొత్త నిర్ణయం తీసుకుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ , దానికి సహజర సంస్థ మజీద్ బ్రిగేడ్ ను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా ప్రకటించింది. 2019లో బలుచిస్తాన్ సెలబ్రేషన్ ఆర్మీని స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపుగా ప్రకటించింది అమెరికా. కొన్ని దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా వెల్లడించింది. 2019 నుంచి ఆ సంస్థ ద్వారా జరిగిన దాడులకు బీ ఎల్ ఏ బాధ్యత వహించిందని అమెరికా వెల్లడించింది.. అయితే అమెరికా తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ కోసమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యాధిపతి అమెరికాలో ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
కొంతకాలంగా భారతదేశానికి ట్రంప్ దూరంగా జరుగుతున్నారు. మన దేశం మీద అడ్డగోలుగా సుంకాలు విధిస్తున్నారు. అనేక విధాలుగా మనం సహకరిస్తున్నప్పటికీ ట్రంప్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా తన మూర్ఖపు విధానాలతో భారతదేశాన్ని మరింత దూరం చేసుకుంటున్నారు. అంతేకాదు పాకిస్తాన్ కు అత్యంత దగ్గరవుతున్నారు. విదేశీ మీడియా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్ దేశ అధ్యక్షుడిగా అసీమ్ మునీర్ ను చూడాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గడచిన రెండు నెలల్లో మునీర్ రెండుసార్లు అమెరికా వెళ్లారు. పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అధ్యక్ష పదవిని దక్కించుకోవడానికి ట్రంప్ తో కలిసి మునీర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమెరికా గడ్డమీద భారత మీద మునీర్ నిత్యం విషం కక్కుతూనే ఉన్నారు. భారత్ సింధు నది మీద జలాశయం నిర్మిస్తే మిస్సైల్స్ తో పడగొడతామని.. తమరు రెచ్చగొడితే భారతదేశంలో అల్లకల్లోలం సృష్టిస్తామని మునీర్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.