Mahesh Babu rejects director movie offer: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలను సెలెక్ట్ చేసుకునే విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తుంటాడు. ఎవరికి పడితే వాళ్లకి డైరెక్షన్ చేసే అవకాశామైతే ఇవ్వడు. తనకు ఎవరైతే బాగా నమ్మకంగా ఉంటారో, ఎవరైతే తప్పకుండా సక్సెస్ ఫుల్ సినిమాని చేయగలడు అనే ఒక నమ్మకం తనకి కుదురుతుందో వాళ్లకు మాత్రమే సినిమా చేసే అవకాశాన్ని ఇస్తాడు. ఇక ఈ క్రమంలోనే మెహర్ రమేష్ లాంటి దర్శకుడు మహేష్ బాబు తో సినిమా చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలైతే చేశారు. కానీ అతనికి సినిమా చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. ఇక వీళ్లిద్దరు కలిసి బాబీ సినిమాలో నటించారు.
అప్పటినుంచి మహేష్ బాబు కి మెహర్ రమేష్ కి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒక రకంగా మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ లను తనే చూసుకుంటూ ఉంటాడు. మెహర్ రమేష్ కథలు బాగా చెప్తాడు అనే టాక్ అయితే ఇండస్ట్రీ లో ఉంది. గతంలో మహేష్ బాబు కి చాలా కథలు చెప్పాడట. కానీ మహేష్ అవకాశం ఇవ్వలేదు. దాంతో రమేష్ ఎన్టీఆర్ తో కంత్రి సినిమా చేశాడు.
Also Read: ప్రభాస్ ఫౌజీ సినిమాను అనవసరంగా చేస్తున్నాడా…తన వల్లే లేటవుతుంది..
ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసిన బిల్లా ఓకే అనిపించింది. ఇక మూడో సినిమాగా చేసిన ‘శక్తి’ సినిమా డిజాస్టర్ గా మారడమే కాకుండా ఎన్టీఆర్ కెరియర్ లో భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇలాంటి క్రమం లోనే మెహర్ రమేష్ పేరు చెప్తే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు భయపడిపోతున్నారు. మహేష్ తనతో సినిమా చేయకుండా మంచి పని చేశాడు అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం కామెంట్లు చేశారు…
మరి మహేష్ బాబు సినిమాలు చేసే విషయంలో తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాడని చాలామంది చెబుతుంటారు. మెహర్ రమేష్ విషయంలో స్పష్టంగా కనిపించింది… ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో అతను ఈ మూవీ కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు…