TATA Harrier EV: దేశంలో కార్ల విక్రయాల్లో టాప్ 2 గా ఉంటున్న TATA కంపెనీ నుంచి SUV కార్లు ఎక్కువగా మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. అయితే నేటితనం వినియోగదారులు SUV కార్లలో కొత్త మార్పులు కోరుకుంటున్నారు. ఇంజన్ పనితీరుతో పాటు స్మార్ట్ టెక్నాలజీ కలిగిన ఫీచర్స్ ఉన్న కార్లపై మొగ్గు చూపుతున్నారు. దీనిని బాగా గమనించిన టాటా కంపెనీ తన కొత్త కారులో అధునాతన టెక్నాలజీ కలిగిన స్మార్ట్ ఫీచర్లతో పాటు పూర్తిగా విద్యుత్ వేరియంటుతో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కారు ధర కూడా అందుబాటులో ఉండడంతో ప్రీమియం కార్లు కొనేవారు సైతం దీని వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ టాటా కంపెనీకి చెందిన ఏ కారు స్పెషల్ గా రాబోతుంది? దీని ధర ఏ విధంగా ఉండనుంది?
TATA కంపెనీకి చెందిన Harrier EV త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు ఎలా ఉండబోతుందో ఇప్పటికే ఆన్లైన్లో చర్చ సాగుతోంది. ఇందులో బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో MIDC అనే బ్యాటరీ ఉండడంతో దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 622 నుంచి 627 వరకు మైలేజ్ అందిస్తుంది. అయితే రోడ్ల పనితీరు, బరువును బట్టి 450 నుంచి 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ని ఇస్తుంది. ఈ బ్యాటరీ చార్జింగ్ కోసం 120 kW నుంచి DC వరకు ఫుల్ సపోర్ట్ ఉండనుంది. 25 నిమిషాల్లో 20 నుంచి 80% వరకు చార్జింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే దీనికి AC చార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది.నగరాల్లో ప్రయాణించే వారితో పాటు లాంగ్ డ్రైవ్ చేసే వారికి ఈ మైలేజ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కారులో AWD శక్తివంతంగా పనిచేస్తుంది. డ్యూయల్ మోటార్ సెటప్ కలిగిన ఇది 6.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇందులో రెండు డ్రైవింగ్ మోడ్ లు ఉండడంతో ట్రాఫిక్ లోనూ బయటపడడానికి అనుగుణంగా ఉంటుంది.
ఈ కారులో ఇప్పటి తరం వారికి అనుగుణంగా ఉండే స్మార్ట్ ఫీచర్లను అమర్చారు. ముఖ్యంగా డిస్ప్లే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఇది 14.5 అంగుళాల నియో QLED టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ను చూడొచ్చు. దీనితోపాటు పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా ఉండరు ఉంది. ఓవర్ ది ఎయిర్ అప్డేట్ తో పాటు వాయిస్ కంట్రోల్స్, డిజిటల్ కి యాక్సెస్, 360 డిగ్రీ కెమెరా సిస్టం వంటివి డ్రైవర్లతోపాటు ప్రయాణికులకు అనుగుణంగా ఉంటుంది.
ఈ కారు ఎక్స్టీరియర్ డిజైన్ కూడా వేరే లెవల్ అనుకోవచ్చు. పూర్తిగా బోల్డ్ లుక్ లో కనిపించే దీనికి క్లోజ్డ్ గ్రిల్, అలాయ్ వీల్స్, అందాన్ని తీసుకొచ్చే లైటింగ్ సిగ్నేచర్ వంటివి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక దీనిని రూ రూ.21.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఎలక్ట్రిక్ SUV ల కంటే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ ఉండడంతో చాలామంది దీని వైపు చూస్తున్నారు.
