Mahesh Babu and Rajamouli : ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో ఒక తెలుగు డైరెక్టర్ కి భారీ క్రేజ్ దక్కడం అనేది నిజంగా గ్రెస్ట్ అనే చెప్పాలి. ప్రస్తుతం రాజమౌళి ఇండియా లోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు…అలాగే ఇండియాలో ఆయనతో పోటీకి వచ్చే దర్శకులు కూడా ఎవ్వరూ లేకపోవడం విశేషం…
Also Read : మహేష్-రాజమౌళి టైటిల్ ఫిక్స్.. ఒడిశా ప్రజల ఆతిథ్యంపై రాజమౌళి ఏమోషనల్…
దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)… ఆయన చేసిన ప్రతి సినిమా కూడా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన మహేష్ బాబు(Mahesh Babu) తో కలిసి చేస్తున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని మీడియాకు చెప్పకుండా చాలా రహస్యంగా తన షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఆయన చాలా బిజీగా గడుపుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే ఈ సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ ను చాలా పెద్ద రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ సినిమా నుంచి ఒక్క ఫోటోను గాని వీడియోని గాని లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబును వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్ లో పృధ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారట. మరి మహేష్ బాబుని నమ్మించి మోసం చేసే ఆ పాత్రకి తను న్యాయం చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమా మొత్తానికి ఇదో పెద్ద ట్విస్ట్ గా చెప్పుకుంటున్నారు.
మొదటి నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికి చివర్లో మాత్రం అతను చేసిన ద్రోహానికి హీరో ఎలా రివెంజ్ తీర్చుకున్నాడనేది మిగతా స్టోరీగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఒక పెను సంచలనంగా మారబోతోంది. అలాగే పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచంలో ఉన్న చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో తనకంటూ పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన జేమ్స్ కామెరూన్ లాంటి దిగజ దర్శకులను సైతం మెప్పించాడు. మరి మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైతే ఉంటుంది. ఇక ఈ సినిమాను కూడా చాలా వరకు వైవిద్యభరితమైన కథాంశంతో తెరకెక్కించడమే కాకుండా ఆయా సీన్స్ ను ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి అంటూ రాజమౌళి కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది…
Also Read : మహేష్, రాజమౌళి మూవీ లో హనుమంతుడు, లక్ష్మణుడు..పూర్తి స్టోరీ మొత్తం లీక్ అయిపోయిందిగా!