Mahesh Babu: మహేష్(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) మూవీ కి సంబంధించి ఒక్క చిన్న అప్డేట్ కోసం అభిమానులు ఎంతో కాలం నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇతర స్టార్ హీరోలకు సంబంధించిన అప్డేట్స్ ని చూసి, మా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అని దీనంగా సోషల్ మీడియా లో విచారిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎన్నో పండుగలు వచ్చి వెళ్లిపోతున్నాయి, మూవీ టీం నుండి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. రాజమౌళి మహేష్ బాబు పాస్ పోర్ట్ ని లాక్కొని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. అది తప్ప ఈ సినిమా గురించి మరో అప్డేట్ బయటకు రాలేదు. కానీ ఇటీవలే ఒడిశా లో మొదటి షెడ్యూల్ ని వాయు వేగంతో పూర్తి చేయడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలై తీరుతుంది అని అంతా అనుకున్నారు, సంతోషించారు కూడా.
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
కానీ రెండవ షెడ్యూల్ ఇప్పటికీ మొదలు కాకపోవడంతో అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. మహేష్ బాబు తన కుటుంబం తో కలిసి ఇటలీ టూర్ కి వెళ్ళాడు. అక్కడ ఆయన లొకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోలను నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి. మరోపక్క రాజమౌళి జపాన్ పర్యటన లో ఉన్నాడు. ఆయన తెరకెక్కించిన #RRR చిత్రానికి సంబంధించిన షూటింగ్ మేకింగ్ ని ఒక డాక్యుమెంటరీ రూపం లో థియేటర్స్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. థియేటర్స్ లో పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ, నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ని జపాన్ భాషలో డబ్ చేసి అక్కడి థియేటర్స్ లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేశారు. గత శుక్రవారం విడుదలైన ఈ డాక్యుమెంటరీ మూవీ ప్రొమోషన్స్ కోసం రాజమౌళి జపాన్ కి వెళ్ళాడు.
దీనిని చూసిన అభిమానులు, రెండవ షెడ్యూల్ మొదలు అవ్వడానికి సమయం ఉంటే స్క్రిప్ట్ మీద కూర్చొని పని చెయ్యాలి కానీ, ఇలా డాక్యుమెంటరీ సినిమా కోసం అంత దూరం వెళ్తావా?, ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ మహేష్ అభిమానులు సోషల్ మీడియా లో రాజమౌళి ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ఏమి తీసినా ఆడియన్స్ చూసే రోజులు పోయాయని, ఒకప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక్కడే ఉండేవాడని, కానీ ఇప్పుడు అలాంటి డైరెక్టర్స్ దేశవ్యాప్తంగా నాలుగైదు మంది తయారు అయ్యారని, రాజమౌళి #RRR విజయ గర్వం నెత్తికి ఎక్కించుకోకుండా, మా మహేష్ సినిమా కోసం అనేక జాగ్రత్తలు తీసుకొని మన దేశం మరోసారి గర్వపడే సినిమాని ఇవ్వాలంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా రాజమౌళి ని కోరుకుంటున్నారు.