Good Bad Ugly: తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని, కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా కాలం నుండి సరైన సూపర్ హిట్ చిత్రం లేక ఇబ్బంది పడుతున్న అజిత్ కి, ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు. బుక్ మై షో(Book My Show) యాప్ లో ఈ సినిమాకు టికెట్స్ నాలుగు రోజులు హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. కేవలం తమిళ వెర్షన్ నుండే ఈ సినిమాకు నాలుగు రోజుల్లో 12 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అట. ఇటీవల విడుదలైన తమిళ చిత్రాలలో ఇది ఆల్ టైం రికార్డు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
మొదటి రోజు నుండి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోయాయని, విడుదలకు ముందు రోజు వరకు ఈ సినిమాకు మరో నాలుగు లక్షల టికెట్స్ సేల్ అయ్యాయని, మొత్తం మీద బుక్ మై షో యాప్ లో 16 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇది కేవలం బుక్ మై షో యాప్ మాత్రమే, డిస్ట్రిక్ట్ యాప్ లో కూడా అత్యధికంగా షోస్ ని షెడ్యూల్ చేశారు. అవి కూడా కలిపితే ఇప్పటి వరకు ఈ చిత్రానికి 30 లక్షల టికెట్స్ అమ్ముడుపోయి ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక గ్రాస్ విషయానికి వస్తే మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నాలుగు రోజులకు కలిపి 145 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది అంటున్నారు.
ఓవర్సీస్ లో నాలుగు రోజుల్లో 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందట. అజిత్ కెరీర్ లో ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా ఈ చిత్రం నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడడం లేదు. నాలుగు రోజులకు కలిపి కేవలం రెండు కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. నేడు తమిళనాడు రాష్ట్రానికి కొత్త సంవత్సరం కావడంతో, నేడు కూడా హాలిడే అవ్వడంతో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే జరిగాయి. నేడు కూడా ఈ చిత్రం తమిళనాడు రాష్ట్రం నుండి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఫుల్ రన్ లో కచ్చితంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. చూడాలి మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది.