Sarkaru vari paata: ప్రయోగాలకు ఎప్పుడూ దూరంగా ఉండే హీరో మహేష్ బాబు. ఒకటి ఆరా ఆయన చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. ‘టక్కరిదొంగ’లో కౌబాయ్ గెటప్ లో ఇరగదీసేలా చేసినా ఆ సినిమా ఆడలేదు. ఈ క్రమంలోనే మాస్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలే ఎక్కువగా చేస్తుంటాడు. తాజాగా ‘సర్కారి వారి పాట’ సినిమాలో బ్యాంకింగ్ మోసాలపై ఓ సినిమా తీస్తున్నాడు.
దర్శకుడు పరుశురాం ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంతవరకూ చేయని ఒక అద్వితీయమైన పాత్రలో చూపించబోతున్నాడట.. ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు వచ్చే ఈ సీన్ అభిమానులకు గూస్ బాంబ్స్ తెప్పించడం ఖాయమంటున్నారు.
పరుశురాం ఇప్పటికే ‘ఆంజనేయులు’,‘గీతాగోవిందం’ లాంటి క్లాస్ మాస్ మూవీలు తీశాడు. ఇప్పుడు సర్కారీ వారి పాటలో మహేష్ ఎన్నడూ చేయని ఒక పౌరాణిక పాత్రలో చూపించబోతున్నాడట..
ఈ సినిమాలో విలన్ అయిన సముద్రఖనికి సింహాచలంలోని ప్రసిద్ధ శ్రీవరహాలక్ష్మీ నృసింహస్వామి అవతారంలో మహేష్ కనిపిస్తాడు. ఈ దేవాలయంలోనే క్లైమాక్స్ కూడా ప్లాన్ చేశారట.. ఇంటర్ వెల్ సీన్ లో మహేష్ పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నాడని.. ఎన్నడూ చూడని మహేష్ ను అలా చూస్తే అందరూ షాక్ అవ్వడం ఖాయమని అంటున్నారు.
మరి ‘దేవుడి’గా మారబోతున్న మహేష్ ఎలా ఉంటాడు? ఎలా కనిపిస్తాడన్నది ఆసక్తి రేపుతోంది. ఈ గెటప్ మాత్రం ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుందని అంటున్నారు.