Poonam Kaur: శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముడిని ఓడించినట్టు.. హీరోయిన్ పూనమ్ కౌర్ ను అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు. పూనమ్ కి – పవన్ కి మధ్య ఉన్న బంధం పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, పూనమ్ తో పవన్ అంటూ ఆ మధ్య చాలా పుకార్లు వచ్చాయి. అయితే విచిత్రంగా వాటిల్లో ఎలాంటి నిజం లేదని పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇటు పూనమ్ కౌర్ మాత్రం ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అనేక ట్విట్లు చేస్తూ ఉంటుంది.

ఆమె ట్వీట్లకి తగ్గట్టు కొందరు పవన్ పై విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు పూనమ్ – పవన్ మధ్య ఏమి జరిగింది ? ఈ విషయం పై స్పష్టత ఇస్తానంటోంది పూనమ్ కౌర్. కాకపోతే.. ఈ విషయాన్ని కూడా డైరెక్ట్ గా చెప్పలేదు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ విజయాన్ని సాధిస్తే.. ఖచ్చితంగా ఇన్నాళ్లు తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెబుతాను అంటూ పూనం కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ పూనమ్ ట్వీట్ లో మ్యాటర్ ఏమిటంటే.. ‘‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ సర్ గెలవాలి. ఓ విషయంలో ఇంతకాలం నేను నిశబ్థంగా ఉన్నాను. ఒకవేళ ప్రకాశ్ రాజ్ గెలిస్తే పరిశ్రమలో నేను ఎదుర్కొన్న సమస్యలను చెప్పే అవకాశం నాకు ఉంటుంది. ఎందుకంటే ప్రకాశ్ రాజ్ వాస్తవికంగా ఉంటారు. ఆయన పై నాకు నమ్మకం ఉంది. ప్రకాష్ రాజ్ చెత్త రాజకీయాలు చేయరు. అందుకే ఆయనకు నా మద్దతు ఉంటుంది. జైహింద్’ ఇది పూనమ్ ట్వీట్ సారాంశం.
పూనమ్ మాటల్లోని అర్ధాలకు ఉన్న భావాలను వెతుక్కుంటే.. ముఖ్యంగా ‘ఓ విషయంలో ఇంతకాలం నేను నిశబ్థం ఉన్నాను’. కచ్చితంగా ఈ మాట అన్నది పవన్ ను ఉద్దేశించే. కాబట్టి.. పవన్ కళ్యాణ్ కి సంబంధించి పూనమ్ ఓ విషయాన్ని చెప్పాలనుకుంటుంది. మరి ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో అర్థం కాకుండా ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పై పంచ్ లు వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పవన్ కి సపోర్ట్ గా ఎందుకు చెబుతుంది. పవన్ పై ఆమె నెగిటివ్ గానే చెబుతుంది, మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.