https://oktelugu.com/

Today Horoscope In Telugu: ఈ రాశి వ్యాపారులు ఈరోజు జాగ్రత్త.. ఉద్యోగులకు అదనపు ఆదాయం..

Today Horoscope In Telugu ఈ రాశి వారు ఈరోజు మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఆ విషయంలో వాగ్వాదం నెలకొంటుంది. ఈ సమయంలో మౌనంగా ఉండటమే మంచిది.

Written By: , Updated On : March 22, 2025 / 08:00 AM IST
Today Horoscope In Telugu (6)

Today Horoscope In Telugu (6)

Follow us on

Today Horoscope In Telugu: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో భాగంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఏ రోజు శుక్రా ఆదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీంతో సింహం సహా కొన్ని రాశుల వారికి శుభయోగాలు జరగనున్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి ప్రత్యేకంగా చర్చ చేస్తారు. సోదరుల మద్దతుతో వ్యాపారులు కొత్తపెట్టబడును పెడతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. పిల్లల కెరీర్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన పనుల కోసం స్నేహితుల సహాయం చేస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఆ విషయంలో వాగ్వాదం నెలకొంటుంది. ఈ సమయంలో మౌనంగా ఉండటమే మంచిది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. డబ్బు అవసరం పడితే బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగులు కార్యాలయాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అయితే ఖర్చులు ఆధారంగా ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈరోజు మానసిక ఒత్తిడికి గురవుతారు. కార్యాలయాల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారుల సహాయం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతను పొందుతారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తను వింటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అనవసరపు వివాదాల్లోకి దూర్చడం వల్ల మానసికంగా ఆందోళనకు గురవుతారు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయాలి. లేకుంటే పాతిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూర్తుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం అవసరం. విద్యార్థుల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అధిక లాభాలు ఉంటాయి. ఈ సమయంలో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు సంస్థలు మారుతారు. అయితే ఇది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొత్త సంస్థలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రాలకు వెళ్తారు. ఇంట్లో శుభకార్యం కోసం బిజీగా మారుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారాలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఒకడిగా వాగ్వాదం ఉంటుంది. ఈ సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు అధిక లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడును పెట్టేవాళ్ళు తండ్రి సలహా తీసుకోవాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఇవి లాభాలను తీసుకువస్తాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడిలో కొంత భాగం ప్రయాణాలకు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామి అండతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అదనప ఆదాయం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇంట్లో ఒకరి వివాహం కోసం తీవ్రంగా చర్చలు చేస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో కొందరు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. మరికొందరికి జీతం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి మార్గం సుఖం అవుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే వైద్యుడిని వెంటనే సంప్రదించాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులు కొన్ని మార్కులు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతుతో ఉద్యోగులు లక్షాలను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మకర రాశి వారికి ఈ రోజు మానసికంగా సమస్యలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని తప్పులు చేస్తారు. అయితే కొందరు ఉద్యోగుల మద్దతుతో వీటిని వెంటనే పరిష్కరించుకుంటారు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఈ పెట్టుబడుల ద్వారా భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉండే వారిని వచ్చి శుభవార్తలు వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు శత్రువులు పెడితే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. విదేశాల్లో ఉండేవారిని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మీరు మానంగా ఉండటమే మంచిది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభకార్యం కోసం చర్చించుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సోదరుల మద్దతుతో వ్యాపారాలు కొత్తపేటలో పెడతారు. పాత స్నేహితుడు కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు నేటితో తొలగిపోతాయి. దీంతో సంతోషంగా ఉండగలుగుతారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు.