Mahesh Babu
Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా ఎలాగైనా భారీ విజయాన్ని సాధిస్తుందని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే రాజమౌళికి ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేది లేదు. ఇంక తన మార్కెట్ కూడా భారీగా ఉంది. కాబట్టి ఈ సినిమా మీద మహేష్ బాబు భారీ కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మహేష్ బాబు ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట. ఈ సినిమా ప్రాఫిట్స్ లో మాత్రమే షేర్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనివల్ల ప్రొడ్యూసర్స్ కొంతవరకు సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలైతే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక రాజమౌళి తన మైండ్ లో ఉన్న విజువల్స్ ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ఈ సినిమాకి నష్టాలు వస్తే రెమ్యూనరేషన్ తీసుకోనని,లాభాలు వస్తేనే దాంట్లో నుంచి 35% రెమ్యూనరేషన్ గా తీసుకుంటానని మహేష్ బాబు ముందే అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నారట. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ వందలు కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్న సందర్భంలో మహేష్ బాబు మాత్రం ప్రాఫిట్ లో పర్సంటేజ్ తీసుకుంటానని చెప్పడంతో ప్రొడ్యూసర్స్ ఒక్కసారిగా షాక్ కి గురి అయినట్టుగా తెలుస్తోంది.
Also Read : మహేష్, రాజమౌళి సినిమా పై అలాంటి ఆశలు ఉంటే పప్పులో కాలేసినట్టే!
నిజానికి సూపర్ స్టార్ కృష్ణ కూడా ప్రొడ్యూసర్స్ ని సేఫ్ జోన్ లో ఉంచడానికి ప్రయత్నం చేసేవాడు. సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ప్రొడ్యూసర్స్ కి నష్టాలు వస్తే తను తీసుకున్న రెమ్యూనరేషన్ ను వెనక్కి తిరిగి ఇచ్చేవాడు. అలాగే ఆ ప్రొడ్యూసర్స్ తో మరొక సినిమా చేయడానికి డేట్స్ ని కూడా ఇచ్చేవాడట. ఇప్పుడు మహేష్ బాబు కూడా ప్రొడ్యూసర్స్ హీరో అనిపించుకుంటున్నాడు.
పుష్ప 2 (Pushpa 2) సినిమా కోసం అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి ఇండియాలో ఇదే హ్యాయెస్ట్ రెమ్యూనరేషన్ గా చెప్పుకుంటున్నారు. కానీ మహేష్ బాబు తీసుకున్న డిసీజన్ వల్ల ఇకమీదట ప్రొడ్యూసర్స్ అందరు సేఫ్ జోన్ లో ఉండే అవకాశాలైతే ఉన్నాయి.
ఇప్పటికే ప్రొడక్షన్ ఖర్చు విపరీతంగా పెరిగిపోవడంతో ఏ ప్రొడ్యూసర్ కూడా సినిమాలను చేయడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి ఇలా ఉంటే మరి కొద్ది రోజులకి సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కొరత ఏర్పడవచ్చు అనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది స్టార్ హీరోలు ఇదే పద్ధతిని అనుసరిస్తే మాత్రం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ సైఫ్ జోన్ లో ఉంటారు. దీనివల్ల ఇంకా చాలామంది కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీ కి వచ్చే అవక్షలు కూడా ఉన్నాయి…
Also Read : రాజమౌళి మహేష్ బాబు మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను ఎక్కడ ప్లాన్ చేశాడో తెలుసా..?