https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు కి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయా..?

Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ తమ ఉపయోగించుకుంటూ భారీ సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ను సాధిస్తూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకునే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు.

Written By: , Updated On : March 20, 2025 / 09:54 AM IST
Mahesh Babu

Mahesh Babu

Follow us on

Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ తమ ఉపయోగించుకుంటూ భారీ సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ను సాధిస్తూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకునే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ ఇప్పటి మాత్రం ఏకంగా ఫ్యాన్ వరల్డ్ సినిమా చేస్తూ ఉండడం విశేషము… రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఎక్కడ చూసినా ఆ సినిమా గురించి చర్చ జరుగుతుంది ఈ సినిమాకు సంబంధించిన సన్నీ కూడా రాజమౌళి బయటకు లీక్ అవ్వకుండా చూసుకుంటున్నాడు…

Also Read : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో భారీ ట్విస్ట్ రివీల్ అయిందిగా…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు(Mahesh Babu)… ఈయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు. అందుకోసమే ఇప్పటివరకు తన కెరియర్ లో చేయనటువంటి రిస్కీ షాట్స్ చేస్తూ ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి(Rajamouli) తో సినిమా అంటే ప్రతి ఒక్కరు అసక్తి చూపిస్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన మాత్రం మహేష్ బాబుతో సినిమా చేయాలని డిసైడ్ అవ్వడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఒడిశా షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ తొందర్లోనే మరో షెడ్యూల్ ని చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే యావత్ తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగి పోతుందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికి మహేష్ బాబు తన తదుపరి సినిమాని కూడా లైన్ లో పెడుతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఆయనకు మంచి పాపులారిటి వస్తుంది. కాబట్టి హాలీవుడ్ సినిమా దర్శకుల నుంచి ఆయనకు ఇప్పటికే కొన్ని ఆఫర్స్ అయితే వస్తున్నాయట. మరి వాటిని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనే డైలామాలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి తను అనుకున్నట్టుగానే భారీ సినిమాలు కనక చేయగలిగితే మాత్రం మహేష్ బాబు సైతం మంచి హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు. ఈ సినిమా తర్వాత ఆయన తెలుగులో సినిమాలు చేస్తాడా లేదంటే ఇంగ్లీష్ సినిమాల పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాతో ఆయనకు వచ్చిన ఇమేజ్ ను కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు…

Also Read : మహేష్-రాజమౌళి టైటిల్ ఫిక్స్.. ఒడిశా ప్రజల ఆతిథ్యంపై రాజమౌళి ఏమోషనల్…