Kamal Haasan , Shankar
Kamal Haasan and Shankar : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన స్టార్ హీరోలు సైతం తెలుగులో మంచి గుర్తింపును పొందడమే కాకుండా వాళ్ళకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలాంటి సందర్భంలోనే కమల్ హాసన్(Kamal Hasan) లాంటి నటుడు కొన్ని స్ట్రైయిట్ సినిమాలు చేసినప్పటికి తమిళ్ డబ్బింగ్ సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అవుతున్నప్పటికి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగడమే కాకుండా లోక నాయకుడిగా కూడా మంచి గుర్తింపైతే తెచ్చుకున్నాడు. ఇక ఏది ఏమైనా కమల్ హాసన్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం… ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగలిగే కెపాసిటీ ఆయన సొంతం. ఇక శంకర్ డైరెక్షన్ లో ఆయన చేసిన ‘భారతీయుడు 2’ (Bharathiyudu 2) సినిమా గత సంవత్సరం వచ్చి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. ఇక ప్రస్తుతం భారతీయుడు 3 సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కమల్ హాసన్ శంకర్ ల మధ్య కొంతవరకు విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.
Also Read : తమిళ బిగ్ బాస్ హోస్టింగ్ ను కమల్ హాసన్ ఎందుకు వదిలేశాడు? కారణమేంటంటే..?
అందువల్లే ఈ సినిమా షూటింగ్ ఆపేసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి భారతీయుడు 2 సినిమా ద్వారా ప్రొడ్యూసర్స్ భారీగా నష్టపోయారు. కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ సినిమాను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓటిటి లో వస్తుందా? లేదంటే థియేటరికల్ రిలీజ్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఒకప్పుడు శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా మంచి విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ బాట పట్టడంతో కమల్ హాసన్ శంకర్ తో సినిమా చేయొచ్చా లేదా అని ఒకటికి పది సార్లు ఆలోచించి మరి భారతీయుడు 3 సినిమాని స్టార్ట్ చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే అటు శంకర్ కి ఇటు కమలహాసన్ కి మంచి గుర్తింపైతే వస్తుంది.
మరి మొదటి పార్ట్ లో అతను చేసిన తప్పులను రెక్టిఫై చేసుకుంటూ మంచి సినిమాలు తీయడానికే శంకర్ చాలా వరకు కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : శంకర్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయిన ‘లైకా ప్రొడక్షన్స్!