Mahesh babu , Rajamouli
Mahesh babu and Rajamouli : యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. నిజానికి బాహుబలి (Bahubali) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి(Rajamoul)… ఆయన చేసిన ప్రతి సినిమా ప్రతి ప్రేక్షకుడిని అలరించడమే కాకుండా పాన్ ఇండియా ఇండస్ట్రీ స్థాయిని పెంచుతూ వస్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమా కూడా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా స్టామినాను చూపించే ప్రయత్నమైతే చేస్తున్నాడు…
Also Read : మహేష్, రాజమౌళి మూవీ లో హనుమంతుడు, లక్ష్మణుడు..పూర్తి స్టోరీ మొత్తం లీక్ అయిపోయిందిగా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి తనదైన రీతిలో సత్తా చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ రెండు సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషమనే చెప్పాలి. ఇది ఒక రాజమౌళి కి మాత్రమే సాధ్యమైందని మిగతా వాళ్ళు ఎవరికీ ఇలాంటి సక్సెస్ లను సాధించడం సాధ్యం కాదనే ఉద్దేశంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం భావిస్తున్నారు. మరి ఇలాంటి విజయాలను అందుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను పాన్ వరల్డ్ గా తెరకెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి 3000 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందని ప్రతి ఒక్కరు అంచనా వేస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగానే రాజమౌళి ఈ సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టి సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఒడిశా లోని కోరాపూట్ ప్రాంతంలోని అడవుల్లో ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చేస్తున్నారు అంటు కొన్ని వార్తలైతే వచ్చాయి.
మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా యూనిట్ నుంచి కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ఆ షెడ్యూల్ ముగిసిందని రాజమౌళి ఒక నోట్ కూడా విడుదల చేశారు. అందులో ఆయన ‘కోరాపూట్ ప్రజలు చూపించిన మర్యాదకు థాంక్స్ అంటూ మీవల్ల మరిన్ని అడ్వెంచర్స్ చేయడానికి మేము సిద్ధం గా ఉన్నాం’ అంటూ తెలియజేశాడు…అలాగే ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా #SSMB 29 అంటూ రాజమౌళి ఆ నోట్ లో తెలియజేయడం విశేషం… కోరాపూట్ ప్రజల పట్ల తన మనసులోని భావాన్ని తెలియజేశారు. ఇక ఈ నోట్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ని ఇక్కడ ప్లాన్ చేశారు. మరి ఫారెస్ట్ లో మహేష్ బాబు మీద కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది మామూలుగా ఉండదనే విషయమైతే మరోసారి మనకు స్పష్టంగా తెలియజేయడానికి ఈ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
Also Read : లీకైన మహేష్ బాబు, రాజమౌళి షూటింగ్ వీడియో..ఊర మాస్ లుక్ లో మహేష్..ప్లానింగ్ మామూలు రేంజ్ లేదుగా!