Mahesh Babu and Rajamouli : మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక వార్త ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను చాలా గోప్యంగా ఉంచాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నాడు కానీ, సోషల్ మీడియా కారణంగా ఆ ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. ఇప్పటికే ఒడిశా లో జరిగిన మొదటి షెడ్యూల్ కి సంబంధించిన షూటింగ్ వీడియో సోషల్ మీడియా లో లీకై సెన్సేషన్ అయ్యింది. రెండవ షెడ్యూల్ ఎప్పుడు మొదలుపెడుతారో తెలియదు కానీ, ఇంతలోపు మరో ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. గతం లో ఎన్నో అర్థవంతమైన సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న ఒక స్టార్ డైరెక్టర్ ఈ సినిమాకు డైలాగ్ రైటర్ గా పని చేయబోతున్నాడు. ఆ డైరెక్టర్ ఈ చిత్రంలో భాగం కావడంపై అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కృష్ణ సీన్ ను రీక్రియేట్ చేస్తున్నారా..?
ఆ డైరెక్టర్ మరెవరో కాదు దేవ కట్ట(Devakatta). ఇప్పటి వరకు ఈయన ప్రస్థానం, వెన్నెల, ఆటో నగర్ సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాలను చేశాడు. ఈ సినిమాలు కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కానీ, ఒక మంచి సినిమాని చూసాము అనే అనుభూతిని ఆడియన్స్ కి మిగిలించాయి. టీవీ టెలికాస్ట్ లో ఈ చిత్రాలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. టాలీవుడ్ లో మంచి క్లాసిక్స్ గా నిలిచాయి. ముఖ్యంగా దేవ కట్ట రాసే డైలాగ్స్ లో చాలా లోతైన భావాలు ఉంటాయి. సమాజం మీద ప్రభావం చూపించే విధంగా అవి ప్రేరేపిస్తాయి. అలాంటి దర్శకుడు మహేష్, రాజమౌళి సినిమాకు పని చేయబోతుండడాన్ని చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమాలో ఎదో సమాజానికి సందేశం ఇచ్చే ఎలిమెంట్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు అభిమానులు. గతం లో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రానికి కూడా దేవ కట్ట కొన్ని డైలాగ్స్ రాశాడు.
యుద్ధంలో మాహిష్మతి సేన మొత్తం కుప్పకూలిపోతున్న సమయంలో, బాహుబలి తన సైన్యం లో ఉత్తేజం కలిగించే ప్రసంగం ఒకటి ఇస్తాడు, అది మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సన్నివేశంలో వచ్చే డైలాగ్స్ ని దేవాకట్టా నే రాశాడు. ఇప్పుడు మరోసారి ఆయన రాజమౌళి సినిమా కోసం పనిచేయబోతున్నాడు. అయితే ఆయన కేవలం కొన్ని సన్నివేశాలకు మాత్రమే డైలాగ్స్ రాస్తున్నాడా?, లేదా సినిమా మొత్తానికి డైలాగ్స్ రాస్తున్నాడా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. చూడాలి మరి బాహుబలి సమయంలో తన డైలాగ్స్ తో క్రియేట్ చేసిన మ్యాజిక్ ని దేవాకట్టా ఈ చిత్రంతో మరోసారి రిపీట్ చేస్తాడా లేదా అనేది. ఇకపోతే ఈ చిత్రం లో విలన్స్ గా ప్రియాంక చోప్రా మరియు మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ లు నటిస్తున్నారు. హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Also Read : రాజమౌళి మహేష్ సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాడా..?