Akhanda 2 : ప్రస్తుతం మన టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ మీద ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పేరు మొదటి స్థానంలో ఉంటుంది. ‘అఖండ’ చిత్రంతో మొదలైన ఆయన జైత్ర యాత్ర, ‘డాకు మహారాజ్’ వరకు సాగింది. అంటే వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ అన్నమాట. ఈ రేంజ్ ఫామ్ లో బాలయ్య బాబు తన కెరీర్ మొత్తం మీద లేడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. నరసింహనాయుడు చిత్రం తర్వాత సరైన హిట్స్ లేకుండా ఇబ్బంది పడుతున్న బాలయ్య కి ‘సింహా’ చిత్రం ద్వారా తిరుగులేని సూపర్ హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను(Boyapati Srinu). ఆ తర్వాత 2020 వ సంవత్సరం వరకు బాలయ్య కి సూపర్ హిట్స్ ఉన్నవి బోయపాటి శ్రీనుతోనే. ఇక 2020 వ సంవత్సరం తర్వాత విడుదలైన అఖండ చిత్రం బాలయ్య జాతకాన్ని మార్చేసింది.
Also Read : అఖండ 2 లో యాక్షన్ డోస్ పెంచుతున్న బోయపాటి…
వరుసగా సూపర్ హిట్స్ అని అందుకుంటూ బాలయ్య ని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేయడమే కాకుండా, యూత్ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. అలా తన జాతకాన్ని మార్చేసిన ‘అఖండ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ ఆరంభం కాకముందు నుండే ఈ సినిమాకు క్రేజ్ ఉంది. ఇక షూటింగ్ మొదలయ్యాక అటు థియేట్రికల్ రైట్స్, ఇటు నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఈ సినిమా కోసం పోటీ పడీమరీ బిజినెస్ చేస్తున్నారు. బాలయ్య గత నాలుగు చిత్రాలు ఓటీటీ లో సెన్సేషన్ సృష్టించాయి. అందుకే ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రానికి ఓటీటీ పరంగా క్రేజీ డీల్స్ వస్తున్నాయి. ఇంతటి క్రేజీ ఆఫర్స్ ఈమధ్య కాలం లో ఏ సీనియర్ హీరో సినిమాకు కూడా రాలేదు.
అమెజాన్ ప్రైమ్ సంస్థ, అదే విధంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయట. రెండు సంస్థలు కూడా వంద కోట్ల రూపాయిలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ నెట్ ఫ్లిక్స్ కి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రీచ్ ఉంటుంది కాబట్టి, నిర్మాత నెట్ ఫ్లిక్స్ కి అమ్మెందుకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారట. అఖండ లాగ కాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో భారీగా తీస్తున్నారు. కాబట్టి అన్ని వెర్షన్స్ కి కలిపి వంద కోట్ల ఆఫర్ పలుకుతుంది. బాలయ్య సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ఈ రేంజ్ కి పలుకుతుందని నందమూరి అభిమానులు కూడా ఊహించి ఉండరు. సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుండగా, విలన్ గా ఆది పిన్ని శెట్టి నటుస్తున్నాడు. అఖండ కి చెవులు పేలిపోయే రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చిన థమన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.
Also Read : అయోమయంలో పడ్డ ‘అఖండ 2’ నిర్మాతలు..వెనకడుగు వేయక తప్పదా?