Mahesh Babu and Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి (Rajamouli)…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే ఆయన చేయాబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆయన చేయబోయే సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాయి. తద్వారా తను ఎలాంటి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మహేష్ బాబు(Mahesh Babu) రాజమౌళి(Rajamouli) కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని దాటి ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించుకోవాలనే ఉద్దేశ్యం లో రాజమౌళి ఉన్నాడు.
Also Read : రాజమౌళి మహేష్ సినిమాలో ఆ ఒక్క సీన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాడా..?
ఇక ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన సినిమా యూనిట్ తొందర్లోనే రెండో షెడ్యూల్ కి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు నాన్న ఆయన కృష్ణ గారి సూపర్ హిట్ సినిమా అయిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా నుంచి ఒక సీన్ ను రీ క్రియేట్
చేసే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక మగధీర (Magadeera) సినిమాలో రామ్ చరణ్ ఉబిలో చిక్కుకున్నప్పుడు గుర్రం వచ్చి కాపాడే సన్నివేశాన్ని చిరంజీవి కొదమ సింహం సినిమాలో నుంచి తీసుకొని రీ క్రియేట్ చేశారు. చిరంజీవి ఎలాగైతే ఆ సినిమాలో చేశాడో అంతకుమించి రామ్ చరణ్ ఈ సినిమాలో చేసి దీన్ని హైలైట్ గా నిలిపాడు. ఇక అదే క్రమంలో ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం కృష్ణ సూపర్ హిట్ సినిమా అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాలోని సీన్ ను రీ క్రియేట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
దీనివల్ల ఘట్టమనేని అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడడమే కాకుండా సినిమా మీద కూడా భారీ హైప్ అయితే వస్తుందనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఇలాంటి ఒక సన్నివేశాన్ని తీసుకొన్నట్టుగా తెలుస్తోంది… మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాడా? తద్వారా యావత్ ప్రపంచంలో ఆయన పేరు మారు మరిగి పోయేలా చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : మహేష్ మూవీపై రాజమౌళి పెద్ద ప్లానింగే