మరో 5 రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే రోజు రానుంది. ప్రస్తుతం రాజమౌళి(SS Rajamouli) మహేష్ చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన మహేష్ ఫ్యాన్స్ కి, కేవలం ఫస్ట్ లుక్ తో సరిపెట్టడం లేదు, మూడు నిమిషాల గ్లింప్స్ వీడియో తో ఫ్యాన్స్ కి విందు భోజనం పెట్టనున్నాడు. ఈ వీడియో తో తానూ మహేష్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నానో చెప్పబోతున్నాడు రాజమౌళి. రీసెంట్ గానే ఈ చిత్రం లో విలన్ క్యారక్టర్ చేస్తున్న పృథ్వీ రాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ పై మీమ్స్, ట్రోల్స్ మామూలు రేంజ్ లో రాలేదు. ఇతర సినిమాల్లో నుండి కాపీ కొట్టి తెచ్చారని, సూర్య ’24’ చిత్రం లోని ఆత్రేయ లుక్ ఇలాగే ఉంటుందని, క్రిష్ 3 లో విలన్ క్యారక్టర్ లుక్ కూడా ఇలాగే ఉంటుందని ఎన్నో ట్రోల్స్ వచ్చాయి.
రాజమౌళి సినిమా అన్న తర్వాత పొగడ్తలు ఎలా ఉంటాయో, విమర్శలు కూడా అలాగే ఉంటాయి, పట్టించుకోనవసరం లేదని మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు. బాహుబలి, #RRR చిత్రాలకు కూడా ఈ రేంజ్ లోనే ఆరంభం లో విమర్శలు వచ్చాయి, కానీ ఆ తర్వాత హిస్టరీ ఏంటో మనమంత చూసాము అంటూ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో మరో మెయిన్ విలన్ క్యారక్టర్ చేస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ని ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. దీనికి ఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇవన్నీ వచ్చేలోపే మహేష్ ఫ్యాన్స్ తమ క్రియేటివిటీ తో సోషల్ మీడియా లో ఎడిటింగ్ వీడియోస్ చేస్తూ తాము రాజమౌళి కి ఏ మాత్రం తక్కువ కాదని చెప్తున్నారు. ఒక అభిమాని చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
A Lion @urstrulyMahesh never announces his hunt…
he just arrives – #SSMB29
Ready for the roar! – on NOV 15th
Do Follow @chandra_dhfm09
for more edits#GlobeTrotter #noveMBerwillbehiSStoRic @ssrajamouli @JioHotstar @ssk1122@JioHotstarTel_@SriDurgaArts pic.twitter.com/fwkPC8Lb4H— Dhfm_beats (@DhfmBeats) November 9, 2025