Health Vs Money: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో వాతావరణం పూర్తిగా కలుషితంగా మారిపోతుంది. అనేక కొత్త రోగాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో డబ్బు సంపాదన కోసం కంటే ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండడమే ప్రధానం అని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే కొందరు లక్షల రూపాయల ఆదాయం అర్జిస్తున్నా.. అంతకంటే ఎక్కువగా వ్యాధులకు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఒక చిన్న పని చేయడం ద్వారా వచ్చిన ఆదాయం వృధా కాకుండా సమతుల్యం చేసుకోవచ్చు. మరి ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఒక కుటుంబంలో యజమాని బాగుంటేనే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. అంటే యజమానికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉండడం వల్లనే అన్ని రకాల పనులు చేయగలుగుతాడు. అలా కాకుండా కొన్ని రకాల వ్యాధులు ఉండడం వల్ల అతడు మరింత ఒత్తిడికి గురై కొత్త రకాల వ్యాధులకు గురవుతాడు. దీంతో దురదృష్టవశాత్తు ఆ యజమానికి ఏదైనా రిస్క్ జరిగితే కుటుంబమే రోడ్డు పాలవుతుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ముందుగా ఒక పేపర్ పై భార్య భర్తలు వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను రాసుకోవాలి. ఇందులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? అవి రాకుండా ఏం చేయాలి? ఇప్పటివరకు ఉన్న ఆరోగ్య సమస్యలను ఎలా తొలగించుకోవాలి? అనే విషయాలపై చర్చించుకోవాలి. ఒకవేళ భార్య కంటే భర్తకు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఉంటే కొన్ని రకాల పనులను భార్య షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కరే ఒత్తిడికి గురి కావడం వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అంతకంటే ముందు భర్త ఏవైనా వ్యసనాలు ఉన్నాయా? అనేది కూడా రాసుకోవాలి. వీటిలో కొన్ని హానికరమైన వ్యసనాలను ముందుగా దూరం చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ వ్యసనాలు సరదాలు తీరుస్తాయి.. కానీ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. తద్వారా కుటుంబమే సమస్యల్లో ఇరుక్కు ఉంటుంది. అందువల్ల వ్యసనాలకు దాదాపు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇదే సమయంలో కొన్ని రకాల వ్యాధులను నయం చేసుకోవడం మంచిది. అంటే కొంతమంది ఆరోగ్య విషయం పట్టించుకోకుండా అదేపనిగా డబ్బు సంపాదన పైనే దృష్టి పెడతారు. ఆరోగ్య సమస్యలు ఉండి ఎంత డబ్బు సంపాదించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే ఆ వ్యక్తి భవిష్యత్తులో చాలా కాలం పాటు పనులు చేయగలుగుతాడు. అందువల్ల ముందుగా ఆరోగ్య విషయంపై దృష్టి పెట్టి.. చిన్న చిన్న సమస్యలను దూరం చేసుకోవడం మంచిది.
డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరం అని నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల సంపాదించిన దానికంటే ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు ఉండి ఎంత డబ్బు సంపాదించినా అది వృధా అని పేర్కొంటున్నారు.