Bigg Boss 9 Telugu Tanuja : ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా నడుస్తున్న ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) రియాలిటీ షోలో టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే ప్రశ్న వస్తే, అందరూ ముక్త కంఠం తో చెప్పే పేరు తనూజ. సోషల్ మీడియా లోని ప్రతీ పోల్ లో ఆమె ఎవ్వరికీ అందనంత భారీ లీడింగ్ తో ముందుకు దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్ వంటి వారికి కూడా టైటిల్ కొట్టేందుకు సమానమైన అర్హతలు ఉన్నాయి. కానీ ఎందుకో తనూజ తో గొడవలు పెట్టుకోవడానికి భయపడుతూ, చాలా సేఫ్ గా ఆడుతున్నారు. దీంతో తనతో సమానమైన ఓటింగ్ ఒక్క కంటెస్టెంట్ కి కూడా లేకపోవడం తో తనూజ విన్నర్ గా ఫిక్స్ అయిపోయింది. అదే కనుక జరిగితే బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ హిస్టరీ లోనే మొట్టమొదటి లేడీ విన్నర్ గా నిలుస్తుంది తనూజ.
ఇదంతా పక్కన పెడితే తనూజ కి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ లోకి రాక ముందు ఈమె జీ తెలుగు ఛానల్ లో సెన్సేషనల్ హిట్ గా నిల్చిన ముద్దా మందారం సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అదే జీ తెలుగు ఛానల్ లో ఈమె ‘అగ్ని పరీక్ష’ అనే సీరియల్ లో కూడా హీరోయిన్ గా చేసింది. ఈ రెండు సీరియల్స్ అయిపోయాక సూపర్ డ్యాన్స్ అనే ప్రోగ్రాం లో ఈమె పాల్గొనడం, ఆ తర్వాత స్టార్ మా ఛానల్ లో కుకింగ్ షో లో పాల్గొనడం వంటివి జరిగింది. ఈ షోస్ ద్వారా ఆమె బోలెడంత ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అందుకే మొదటి వారం నుండి నేటి వరకు ఆమె టాప్ లీడింగ్ తో కొనసాగుతూ ముందుకు పోతూనే ఉంది.
ఇదంతా పక్కన పెడితే మొదటి సీరియల్ ముద్దా మందారం లో హీరో గా నటించిన పవన్ సాయి తో ఎంతో కాలం నుండి డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే అంతకు ముందు పవన్ సాయి కి పెళ్లి అయ్యిందని, కానీ తనూజ తో స్నేహం కారణంగా ఆ దంపతులిద్దరి మధ్య గొడవలు, విబేధాలు ఏర్పడి విడిపోయారని, అప్పటి నుండి తనూజ, పవన్ సాయి రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ ఉంది. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, తనూజ కి పవన్ సాయి అంటే విపరీతమైన ఇష్టం, అభిమానం ఉంది. తన జీవితం లో ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా, నా ఫ్యామిలీ తర్వాత పవన్ సాయి ని అడిగి తీసుకుంటాను అని, నాకు మరో జన్మ అంటూ ఉంటే, పవన్ సాయి లాగా గొప్ప లక్షణాలతో పుట్టాలని కోరుకుంటాను అంటూ ఒక ఇంటర్వ్యూ లో చాలా గొప్పగా చెప్పుకొచ్చింది తనూజ. ఆమె మాటలను బట్టీ చూస్తే కచ్చితంగా వీళ్లిద్దరు రిలేషన్ లోనే ఉన్నారు అనే అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Thana kamam kosam Kapuralu kulche kamist Aunty ekkada…
Tallithandrula kosam desa seva ki vellina vadu ekkada #BiggBossTelugu9 #KalyanPadala pic.twitter.com/2H9WRdwcBG
— (@vandanareddi) November 9, 2025