Retro First Review: ‘కంగువ’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) చేసిన చిత్రం ‘రెట్రో'(Retro Movie). కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 1వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ టీం మొత్తం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా మారిపోయింది. ఈ ప్రొమోషన్స్ లో అందరి కంటే హీరోనే పూజ హెగ్డే బాగా హైలైట్ అవుతుంది. వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తూ, సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్తూ హైప్ ని బాగా పెంచేస్తుంది. నిన్న జరిగిన ఈవెంట్ లో పూజ హెగ్డే స్టేజి మీద డ్యాన్స్ చేయడం, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ‘కన్నిమా’ అనే పాట ఇంతపెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటపై లక్షల సంఖ్యలో రీల్స్ వచ్చాయి.
Also Read: 5 సార్లు రీ రిలీజ్ అయిన ‘ఒక్కడు’..ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే!
ఈరోజు ఈ సినిమా పై ఇంత హైప్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏదైనా ఉందా అంటే అది కన్నిమా పాట అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియా లో డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. చాలా మందికి ట్రైలర్ అసలు అర్థం కాలేదు. కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ స్టైల్ అలాగే ఉంటుంది మరీ. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేరు పై సూర్య దేవర నాగవంశీ కొనుగోలు చేసాడు. ఈమధ్య ఈయన పట్టిందల్లా బంగారమే అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘మ్యాడ్ స్క్వేర్’ హిట్ తో మంచి ఊపు మీదనా నాగవంశీ ఈ సినిమాని కొనుగోలు చేయడంతో ఆడియన్స్ లో మరింత హైప్ ఏర్పడింది.
అయితే రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో ఆయన కొంతమంది మీడియా మిత్రులతో కలిసి ఈ సినిమాని వీక్షించాడట. వాళ్ళ నుండి ఈ చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చిందని అంటున్నారు. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు చాలా ఆసక్తికరమైన కథనంతో, కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ టేకింగ్ తో అద్భుతంగా తెరకెక్కించారని, రీసెంట్ గా విడుదలైన సూర్య అన్ని సినిమాలకంటే ఈ చిత్రం ఎంతో అద్భుతంగా ఉందని, కచ్చితంగా ఇది ఆయన కం బ్యాక్ చిత్రం అవుతుందని, మూడు వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతుందని అంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ని చూసిన తర్వాత ఆడియన్స్ కి గుండెలు బరువెక్కి కన్నీళ్లు వచేస్తాయట. ఇంతటి ఎమోషనల్ క్లైమాక్స్ ఈమధ్య కాలం లో రాలేదని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రివ్యూ షో లో వచ్చిన టాక్ ఎంత వరకు నిజం అవుతుంది అనేది.
Also Read: రాజ్ తరుణ్, శేఖర్ బాషా నన్ను బ్రతకనివ్వరు..దయచేసి రక్షించండి : లావణ్య