Vijayashanti: లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వినిపిస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు విజయశాంతి(Vijayashanti). స్టార్ హీరోల పక్కన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న విజయశాంతి, ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి, హీరోలతో సమానంగా యాక్షన్ సన్నివేశాలు చేసి, ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని, లేడీ అమితాబ్ గా, లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఆరోజుల్లోనే ఈమె చిరంజీవి తో సమానంగా కోటి రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుందంటే, ఎంత పెద్ద సూపర్ స్టార్ అనేది అర్థం చేసుకోవచ్చు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు, తన రాష్ట్రానికి ఎదో ఒకటి చేయాలి అనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది, ఎంపీ గా ఎమ్మెల్యే గా ఎన్నో సేవలు అందించిన విజయశాంతి, ప్రస్తుతం MLC గా కొనసాగుతుంది.
Also Read: రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బాబు డిజాస్టర్ మూవీ..’అతడు’ ఇక లేనట్టే!
ఇదంతా పక్కన పెడితే అసలు విజయశాంతికి పెళ్లి అయ్యిందా, పెళ్లి అయితే ఆమె భర్త ఎవరు, పిల్లలు ఎవరు? అనే ప్రశ్న ఇప్పటికీ జనాల్లో ఉంది. పెళ్లి అయితే అయ్యింది కానీ, సమాజ సేవ కోసం పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నట్టు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది విజయశాంతి. తానూ సంపాదించిన ఆస్తి మొత్తాన్ని తన తల్లి పేరున ఒక ఫౌండేషన్ ని స్థాపించి, జనాలకు అందేలా చేస్తానని చెప్పుకొచ్చింది విజయశాంతి. ఇకపోతే తానూ కష్టపడి చేయించుకున్న నగలన్నీ శ్రీవారి హుండీలో సమర్పించానని కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. సొంత కుటుంబ సబ్యులకు రూపాయి కూడా ఇవ్వలేని మనుషులు ఉన్న కాలంలో సమాజ సేవ కోసం విజయ శాంతి ఇంతటి త్యాగం చేయడం సాధారణమైన విషయం కాదు. ఇకపోతే రీసెంట్ గానే ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు లేటెస్ట్ గా ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది. నిన్న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్స్ ఆఫీస్ పరంగా కమర్షియల్ సక్సెస్ గా నిలుస్తుందా లేదా అనేది తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే. హీరో కళ్యాణ్ రామ్ నేడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ చిత్రం మంగళవారం లోపు బ్రేక్ ఈవెంట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. మరి అవుతుందా లేదా అనేది చూడాలి.
Also Read: అక్షరాలా 400 మిలియన్ వ్యూస్..చరిత్ర సృష్టించిన ‘గేమ్ చేంజర్’