https://oktelugu.com/

Mad Square : రోజురోజుకు పడిపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..6వ రోజు ఎంత వచ్చిందంటే!

Mad Square : భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie) చిత్రానికి బంపర్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Written By: , Updated On : April 3, 2025 / 10:32 AM IST
Mad Square

Mad Square

Follow us on

Mad Square : భారీ అంచనాల నడుమ ఉగాది కానుకగా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie) చిత్రానికి బంపర్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. టాక్ ఆశించిన స్థాయి పాజిటివ్ గా రాకపోయినప్పటికీ, ఒక్కసారి థియేటర్ కి వెళ్లి టైం పాస్ చేయదగ్గ సినిమా అనే టాక్ జనాల్లోకి బాగా వెళ్లడంతో మొదటి నాలుగు రోజులు ఓపెనింగ్స్ దంచి కొట్టేసింది. కానీ ఆ తర్వాత మామూలు వర్కింగ్ డేస్ లో మాత్రం ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతుంది. రోజురోజుకి వసూళ్లు దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా బుక్ మై షో యాప్ లెక్కలు తీసుకుంటే 5 వ రోజున 39 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కానీ ఆరవ రోజు 22 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అంటే దాదాపుగా సగానికి వసూళ్లు పడిపోయాయి అన్నమాట. ఇది ఒక సినిమా లాంగ్ రన్ కి ఏమాత్రం సరైన ట్రెండ్ కాదు.

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది కానీ, ఓవర్సీస్ లో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కుకి చేరుకోలేదు. ఈ వారం తో బ్రేక్ ఈవెన్ అవుతుందని అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా బయ్యర్స్ అందరికీ సక్సెస్ ఫుల్ చిత్రమే. కానీ అత్యధిక లాభాలను ఆశించారు, అది జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇకపోతే ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు ఆరవ రోజున కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. అది కూడా రిటర్న్ జీఎస్టీ తో కలిపి. ఓవరాల్ గా ఈ చిత్రం ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా వరల్డ్ వైడ్ గా 30 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.

Also Read : మ్యాడ్ స్క్వేర్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..దెబ్బ మామూలుగా పడలేదు!

విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి అన్నమాట. ఈ వీకెండ్ కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నందున, లాభాలు 12 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. 10 వ తేదీ వరకు పెద్ద సినిమాలు విడుదల లేకపోవడం వల్ల మరో మూడు కోట్ల రూపాయిల లాభాలు వచ్చే అవకాశం ఉందని, ఓవరాల్ గా 15 కోట్ల రూపాయిల లాభాలు ఫుల్ రన్ లో వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంటే క్లోజింగ్ వసూళ్లు 70 కోట్ల రూపాయిల గ్రాస్, 37 కోట్ల రూపాయిల షేర్ వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కచ్చితంగా అందుకుంటుంది అని అనుకున్న ఈ చిత్రం ప్రస్తుత ట్రెండ్ ప్రకారం 70 కోట్లకు మించదని అంటున్నారు.

Also Read : రంజాన్ రోజున దంచికొట్టిన ‘మ్యాడ్ స్క్వేర్’..’రాబిన్ హుడ్’ కి నిరాశే!