Mohammed Siraj
Mohammed Siraj : ఇటీవల మెగా వేలంలో మహమ్మద్ సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. మహమ్మద్ సిరాజ్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. పరుగులు ఆ స్థాయిలో ఇవ్వడంతో అతనిపై విమర్శలు వచ్చాయి. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్(2/34) తో సత్తా చాటాడు. ముఖ్యంగా మ్యాజికల్ డెలివరీతో ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) ను క్లీన్ బౌల్డ్ చేశాడు.. బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. బెంగళూరు జట్టులో ఏడు సంవత్సరాల పాటు పాడినప్పటికీ సిరాజ్ చెప్పుకునే స్థాయిలో ప్రదర్శన చేయలేదు. కానీ బెంగళూరు జట్టుతో బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మాత్రం సిరాజ్ అదరగొట్టాడు. దేవదత్ పడిక్కల్(7), ఫిల్ సాల్ట్(14), లివింగ్ స్టోన్ (54) ను ఔట్ చేసి బెంగళూరుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. బెంగళూరు పిచ్ పై సిరాజ్ కు విపరితమైన పట్టు ఉంది. అందువల్లేఅతడికి గుజరాత్ యాజమాన్యం అవకాశం ఇచ్చింది. దీంతో సిరాజ్ ఆకట్టుకునే విధంగా బంతులు వేశాడు. ఫలితంగా గుజరాత్ బెంగుళూరు పై ప్యాకేజీ సాధించింది.
Also Read : ఓరయ్యా మీకో దండం.. సిరాజ్ ను ఇలా తగులుకున్నారేంట్రా..
తొలి ఓవర్ నుంచే..
మహమ్మద్ షమీ తొలి ఓవర్ నుంచే బెంగళూరు పై పై చేయి సాధించే ప్రయత్నం మొదలుపెట్టాడు.. ప్రమాదకర ఆటగాడు సాల్ట్ తోలి ఓవర్ లోనే అవుట్ అయ్య ప్రమాదానికి తప్పించుకున్నాడు. సిరాజ్ బౌలింగ్లో సాల్ట్ బ్యాట్ అంచు ను తగులుతూ వెళ్లిన బంతిని కీపర్ బట్లర్ అందుకోలేకపోయాడు. అయితే మరుసటి ఓవర్లో పడిక్కల్ ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.. ఆ మరుసటి ఓవర్ లోనే సాల్ట్ టికెట్లను కూడా పడగొట్టాడు. ఇక హాఫ్ సెంచరీ చేసి బెంగళూరు బౌలర్ల పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న లివింగ్ స్టోన్(54)ను కూడా సిరాజ్ అవుట్ చేశాడు. ఊరించే బంతివేసి సిరాజ్.. లివింగ్ స్టోన్ ను బోల్తా కొట్టించాడు. దీంతో బెంగళూరు 169 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్ ముగించింది. ఒకవేళ లివింగ్ స్టోన్ కనుక అవుట్ కాకపోయి ఉంటే బెంగళూరు మరింత ఎక్కువగా పరుగులు చేసేది. అప్పుడు ఆ టార్గెట్ చేజ్ చేయడం గుజరాత్ కు ఇబ్బందికరంగా మారేది. ఒక రకంగా సిరాజ్ గుజరాత్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అందువల్లే అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అన్నట్టు బెంగళూరు మైదానంలో.. బెంగళూరు జట్టుపై గుజరాత్ ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అతడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీ గా మారాడు. ఇక ఈ మ్యాచ్లో 4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన సిరాజ్.. 19 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది జరిగిన మెగా వేలంలో బెంగుళూరు సిరాజ్ ను రిటైన్ చేసుకోలేదు. ఇప్పుడు అదే జట్టుపై సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకోవడం విశేషం.
Also Read : ప్రేమలో ఉన్నారనుకుంటే.. హైదరాబాద్ డీఎస్పీని అన్నయ్య అంటూ షాకిచ్చింది!